12 ఏళ్లకే ట్రెండ్ సెట్టర్.. హీరోయిన్లను మించి ఫాలోయింగ్..

Updated on: May 05, 2025 | 7:24 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని. 12 ఏళ్ల వయసులోనే ట్రెండ్ సెట్టర్‌గా మారి రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాత, తండ్రి పేరు నిలబెడుతోంది. చిన్న వయసు నుంచే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన సితార.. పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇన్స్టాగ్రాంలో 2మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ను సంపాదించిందంటే ఈ అపరంజి బొమ్మ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు గారాల పట్టి సితార. మొదట ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఫేమ్‌తో గుర్తింపు దక్కినా.. ఆ తర్వాత తన టాలెంట్‌తో సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ చేసుకుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న సితార.. డ్యాన్స్​ వీడియోలతో సోషల్‌ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. అంతేకాదు ఓ ప్రముఖ జ్యూయెలరీ సంస్థకు బ్రాండ్​ అంబాసిడర్​గా వ్యవహరిస్తూ ఓ హీరోయిన్‌ అందకునేంత రెమ్యునరేషన్‌ తీసుకుంది. సితార ఇప్పటి వరకు సినిమాల్లో నటించలేదు. కేవలం యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే ఇంత ఫేమ్ సంపాదించుకుంది. అయితే సితార తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆమె తల్లి నమ్రతా కృషి చాలా ఉంది. డ్యాన్స్‌,యాక్టింగ్‌, హావభావాలు పలికించడంలో రాటుదేలేలా ట్రైనింగ్ ఇప్పించింది. ఇలా చిన్నప్పటి నుంచే సితారపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో చిన్న వయసులోనే స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొన్నే రిలీజ్‌.. అప్పుడే స్ట్రీమింగ్ డేట్ !! OTTలోకి ఓదెల 2

నన్ను టెర్రరిస్ట్ అంటావా ?? అన్వేష్‌కి ఇచ్చిపడేసిన సోహైల్

కోర్టుతో ఆటలాడితే.. చిప్పకూడు తినాల్సిందే..

షాకింగ్ న్యూస్! కోహ్లీ బయోపిక్‌లో చరణ్‌ కాదు శింబు నటిస్తున్నాడు?

ఛీ వీడు మనిషి కాదు! సెల్ఫీ పేరుతో హీరోయిన్‌ను అసభ్యంగా తాకిన ఫ్యాన్