ఆస్కార్ రేసులో ఇండియన్ సినిమాల దూకుడు

Updated on: Jan 11, 2026 | 5:09 PM

ఆస్కార్ అవార్డుల కోసం భారతీయ సినిమాలు గట్టి పోటీనిస్తున్నాయి. హోంబలే ఫిలింస్ నుంచి కాంతార వన్, మహాఅవతార్ నరసింహ ఉత్తమ చిత్రం జనరల్ ఎంట్రీ జాబితాలో నిలిచాయి. మహాఅవతార్ నరసింహ యానిమేటెడ్ విభాగంలో చరిత్ర సృష్టించింది. పలు ఇతర భారతీయ చిత్రాలతో పాటు హోమ్‌బౌండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ అధికారిక ఎంట్రీ.

ఆస్కార్ బరిలో భారతీయ చిత్రాలు ఈసారి మరింత ఉత్సాహంగా దూసుకుపోతున్నాయి. అకాడమీ అవార్డుల వేడుక సమీపిస్తున్న తరుణంలో, ఇండియన్ సినిమాలు ఆస్కార్ వేదికపై అద్భుతం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి ప్రధానంగా ఒకే నిర్మాణ సంస్థైన హోంబలే ఫిలింస్ నుంచి రెండు సినిమాలు అవార్డుల రేసులో ముందున్నాయి. హోంబలే ఫిలింస్ నిర్మించిన కాంతార వన్, మహాఅవతార్ నరసింహ ఉత్తమ చిత్రం విభాగంలో జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇది హోంబలే ఫిలింస్ కథాబలానికి నిదర్శనం. మహాఅవతార్ నరసింహ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం విభాగంలోనూ పోటీ పడుతూ, ఈ విభాగంలో ఎంపికైన తొలి ఇండియన్ యానిమేషన్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరంజీవికి ఏపీ సర్కార్‌ లడ్డూలాంటి న్యూస్

Chiranjeevi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిన్నారికి మెగా సాయం

The Raja Saab Collection: టాక్ సంగతి పక్కకు పెడితే… రాజాసాబ్‌కు డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్‌

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు తృటిలో తప్పిన ప్ర‌మాదం

The Raja Saab: ధురంధర్ రికార్డ్ బద్దలుకొట్టిన రాజాసాబ్