హృతిక్‌కు యాక్సిడెంట్ !! యంగ్ టైగర్ సినిమాపై ఎఫెక్ట్ ??

|

Feb 16, 2024 | 7:35 AM

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్‌ రోషన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని హృతిక్‌నే సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు. ఇందులో నడుముకు ఒక బెల్ట్ కట్టుకుని వీల్ చైర్‌ లో ఊతకర్రల సాయంతో నిలుచున్నాడు హృతిక్‌. అంతేకాదు 'గతంలో మీలో ఎంత మందికి ఈ క్రచెస్‌, ఊత కర్రలు అవసరమొచ్చింది? ఆ సందర్భంలో మీ ఫీలింగ్‌ ఏంటి? ' అని తన అభిమానులను అడిగాడీ స్టార్ హీరో.

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్‌ రోషన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని హృతిక్‌నే సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు. ఇందులో నడుముకు ఒక బెల్ట్ కట్టుకుని వీల్ చైర్‌ లో ఊతకర్రల సాయంతో నిలుచున్నాడు హృతిక్‌. అంతేకాదు ‘గతంలో మీలో ఎంత మందికి ఈ క్రచెస్‌, ఊత కర్రలు అవసరమొచ్చింది? ఆ సందర్భంలో మీ ఫీలింగ్‌ ఏంటి? ‘ అని తన అభిమానులను అడిగాడీ స్టార్ హీరో. గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హీరోకు ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు. తోటి స్టార్ హీరోలు కూడా హృతిక్‌కు మెసేజులు చేస్తున్నారు. హృతిక్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఫొటో చూస్తుంటే హృతిక్‌కు తీవ్రమైన గాయాలే అయ్యాయనిపిస్తోంది. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం ఈ హీరో వెల్లడించలేదు. బహుశా ఫైటర్ సినిమా షూటింగ్‌ సమయంలో ఏమైనా దెబ్బలు తగిలి ఉండవచ్చని తెలుస్తోంది.

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dunki: చడీచప్పుడు కాకుండా OTTలో రికార్డులు బద్దలు కొడుతున్న షారుఖ్ సినిమా..

Oy: అప్పుడు ఫట్టు.. ఇప్పుడు హిట్టు.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్

ఏంది సామి.. ఈయన సంపాదన 1,578 కోట్లా !!

అన్నా.. నువ్వు తోపు అన్నా.. పుట్టిన బిడ్డను ఎత్తుకుని.. గోల్డ్‌ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి..