హిట్‌ వచ్చినా.. బ్రేక్‌ తీసుకుంటున్న డైరెక్టర్లు

Edited By:

Updated on: Mar 25, 2026 | 10:33 PM

టాలీవుడ్ ఇండస్ట్రీ విజయాల వెంటే పరుగెడుతుంది. హిట్ ఇచ్చిన దర్శకులకే అవకాశాలుంటాయి. కానీ వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, పరశురామ్, శివ నిర్వాణ వంటి పలువురు స్టార్ డైరెక్టర్లు ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. భారీ డిజాస్టర్‌లు, డేట్స్ సమస్యలు, ప్రాజెక్ట్ జాప్యాలు వారి కెరీర్‌కు బ్రేక్ చేశాయి. దీంతో సిల్వర్ స్క్రీన్‌పై వారి లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దర్శకులు తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్‌ వెంటే పరిగెడుతుంది. అందుకే హిట్‌ ట్రాక్‌లో ఉన్న దర్శకులకే వరుస అవకాశాలు వస్తాయి. కానీ అలా హిట్ సౌండ్ చేసిన కూడా కెరీర్‌లో బ్రేక్ వచ్చిన దర్శకులు కొంత మంది ఉన్నారు. కాంబినేషన్స్‌ సెట్ అవ్వకో, డేట్స్ అడ్జస్ట్ అవ్వకో సైలెంట్‌ మోడ్‌లోనే ఉన్నారు కొత్త మంది దర్శకులు. కెరీర్‌లో దాదాపు అన్ని హిట్ సినిమాలే చేసిన వంశీ పైడిపల్లి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమా తరువాత కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్స్‌తో మూవీ ప్లాన్‌ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నా.. అఫీఫియల్‌ ఎనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. భారీగా తెరకెక్కిన ఏజెంట్‌ సినిమా దారుణంగా డిజాస్టర్ కావటంతో నెక్ట్స్‌ ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పవన్‌తో మూవీ ఓకే అయినా అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో క్లారిటీ లేదు. గీతా గోవిందం, సర్కారువారి పాట లాంటి సూపర్‌ హిట్ సినిమాలు చేసిన పరశురాం తరువాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో నిరాశపరిచారు. ఆ ఫెయిల్యూర్‌ ఈ డైరెక్టర్‌ కెరీర్‌ను గట్టిగానే ఎఫెక్ట్ చేసింది. అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేందుకు చాలా టైమ్ తీసుకుంటున్నారు పరశురామ్‌. నిన్నుకోరి, మజిలీ సినిమాలతో సెన్పిబుల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివా నిర్వాణ, తరువాత టక్‌ జగదీష్‌, ఖుషీ సినిమాలతో నిరాశపరిచారు. దీంతో ఈ యంగ్ డైరెక్టర్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. అందుకే నెక్ట్స్ మూవీతో ఎలాగైన సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారు శివ. ఇలా మంచి క్రేజ్ ఉన్న దర్శకులు కూడా సైలెంట్‌ మోడ్‌లో ఉండటంతో సిల్వర్‌ స్క్రీన్ మీద ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ

తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు

ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే

Follow Us