హైకోర్టును ఆశ్రయించిన మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాత
చిత్ర నిర్మాత శంకర వరప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా టికెట్ ధరల పెంపునకు 90 రోజుల ముందు హోం శాఖకు దరఖాస్తు చేసుకోవాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేశారు. అయితే, డివిజన్ బెంచ్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా, పిటిషన్ విచారణ సింగిల్ బెంచ్ వద్దే పెండింగ్‌లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని ఆదేశించింది.
సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. చిత్ర నిర్మాత శంకర వరప్రసాద్, సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీల్ చేశారు. సినిమా విడుదల తేదీకి 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు కోసం హోం శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఇబ్బందికరంగా ఉన్నాయని చిత్ర నిర్మాత తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్ ముందు వాదించారు. సినిమా విడుదల తేదీలు తరచూ మారే అవకాశం ఉన్నందున, 90 రోజుల నిబంధన ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Khairatabad: ఖైరతాబాద్ లో కుక్కల స్వైరవిహారం
Nara Lokesh: అధికారంలో ఉన్నాం.. అలకలు వద్దు
Bhadrachalam: మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావుకు దగ్గరగా వెళ్లిన చిన్నారులు
