Janhvi Kapoor: మోకాళ్లపై.. మోకాళ్ల పర్వతం ఎక్కిన జాన్వీ కపూర్ భక్తికి ఫిదా.! వీడియో.
దివంగత అందాల తార శ్రీదేవి కుమార్తె, ప్రముఖ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని తరచూ దర్శించుకుంటుంది. పుట్టిన రోజు, పండగలు, పర్వదినాలు ఇంకా పలు ప్రత్యేక సందర్భాల్లో ఏడుకొండల వాడిని ప్రసన్నం చేసుకుంటుంది. తాజాగా తన పుట్టిన రోజు మార్చి6 సందర్భంగా కాలినడకన శ్రీవారిని దర్శించుకుంది జాన్వీ. ఆ సమయంలో ఆమె వెంట తన స్నేహితులు శిఖర్ పహారియా, ఓరీ కూడా ఉన్నారు.
దివంగత అందాల తార శ్రీదేవి కుమార్తె, ప్రముఖ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని తరచూ దర్శించుకుంటుంది. పుట్టిన రోజు, పండగలు, పర్వదినాలు ఇంకా పలు ప్రత్యేక సందర్భాల్లో ఏడుకొండల వాడిని ప్రసన్నం చేసుకుంటుంది. తాజాగా తన పుట్టిన రోజు మార్చి6 సందర్భంగా కాలినడకన శ్రీవారిని దర్శించుకుంది జాన్వీ. ఆ సమయంలో ఆమె వెంట తన స్నేహితులు శిఖర్ పహారియా, ఓరీ కూడా ఉన్నారు. తాజాగా తిరుమల యాత్రకు సంబంధించిన తమ అనుభవాలను ఒక వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు ఓరీ. చెన్నైలోని జాన్వీ కపూర్ ఇంటి నుంచి కారులో బయలుదేరిన తమకు తిరుపతికి చేరుకునేందుకు దాదాపు మూడు గంటలు పట్టిందని ఓరీ ఆ వీడియోలో చెప్పాడు. అక్కడి నుంచి జాన్వీ కపూర్ తమ కుటుంబీకులు, బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామన్నారు. అయితే మోకాళ్ల మిట్ట దగ్గరకు వచ్చాక జాన్వీ కపూర్ – శిఖర్ మోకాళ్లపై తిరుమల గుడి మెట్లెక్కారట. జాన్వీ ఇప్పటివరకు సుమారు 50 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుందని ఓరీ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ దేవస్థానమంటే తనకెంతో ఇష్టమని, కుదిరితే ఇక్కడే వివాహం చేసుకుంటానని గతంలో పలు సార్లు జాన్వీ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోఓరీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.