Bangalore Days: ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!

|

Aug 22, 2024 | 10:38 AM

అప్పుడెప్పుడో సమంత రానా లు ఓ సీరిస్‌ చేశారు. బెంగుళూరు డేస్‌ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. సాధారణంగా బెంగుళూరు డేస్ మూవీ నేమ్‌ వింటేనే దుల్కర్ సల్మాన్ సినిమానే గుర్తుకు వస్తుంది. 2014లో మలయాళంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో దుల్కర్ సల్మాన్ తో పాటు నజ్రియా, పార్వతి , నివిన్ పౌలి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

అప్పుడెప్పుడో సమంత రానా లు ఓ సీరిస్‌ చేశారు. బెంగుళూరు డేస్‌ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. సాధారణంగా బెంగుళూరు డేస్ మూవీ నేమ్‌ వింటేనే దుల్కర్ సల్మాన్ సినిమానే గుర్తుకు వస్తుంది. 2014లో మలయాళంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో దుల్కర్ సల్మాన్ తో పాటు నజ్రియా, పార్వతి , నివిన్ పౌలి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఫ్రెండిషిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇదే సినిమాను 2016లో తమిళంలో ఇదే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో ఆర్య, శ్రీవిద్య, రానా , సమంతలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే అప్పట్లో దీని తెలుగు వెర్షన్ థియేటర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అది జరగలేదు. దీంతో ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రైట్స్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక ఒరిజినల్ మలయాళం వెర్షన్ కావాలంటే మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సినిమా మొత్తం నలుగురు స్నేహితుల చుట్టే తిరుగుతుంది. స్నేహం, ప్రేమ, పెళ్లి, కెరీర్ కు సంబంధించి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఎక్కడ బోర్ కొట్టని ఈ సినిమా చూసే వారికి మంచి ఫీల్ ను ఇస్తుంది. మరి మీరు కూడా ఈ బెంగళూరు డేస్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఇప్పుడు ఎంచక్కా తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on