హనుమాన్‌ అరుదైన రికార్డు.. 92 ఏళ్ల టాలీవుడ్‌ చరిత్రలో..

|

Feb 04, 2024 | 9:01 PM

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా ఇప్పటికీ థియేటర్స్‌లో దూసుకుపోతోంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. జనవరి 12న హనుమాన్ విడుదలైంది. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకొని ఇప్పటికీ రికార్డ్ లెవెల్ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 145 కోట్లకు పైగా నెట్ 280 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా ఇప్పటికీ థియేటర్స్‌లో దూసుకుపోతోంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. జనవరి 12న హనుమాన్ విడుదలైంది. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకొని ఇప్పటికీ రికార్డ్ లెవెల్ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 145 కోట్లకు పైగా నెట్ 280 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. 300 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ఇప్పటివరకు నిర్మాతలకు 115 కోట్లకు పైగా ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో హనుమాన్ సినిమా ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా ఈ సినిమా నిలిచిందని తెలిపారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ఏ సినిమా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్య వీధుల్లో సుందర దృశ్యం.. పులకించి పోయిన రామ భక్తులు

ఏనుగు లైట్‌ తీసుకుంది గానీ.. లేదంటే చుక్కలే

Donald Trump: చేతిపై ఎర్రని మచ్చలు.. ట్రంప్ కు ఏమైంది ??

భార్య సాయంతో తండ్రిగా మారిన ట్రాన్స్‌జెండర్‌

‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’ తల్లితండ్రుల క్షమాపణ కోరిన జుకర్‌బర్గ్‌

Follow us on