2025లో గూగుల్‌ను ఊపేసిన టాప్ 10 సినిమాలివే
2025లో గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితా విడుదలైంది. ఈ ఏడాది నెటిజన్లు ఏ సినిమా కోసం ఎక్కువగా వెతికారో అధికారికంగా వెల్లడైంది. టాప్ 10లో బ్లాక్‌బస్టర్‌లతో పాటు కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'సైయ్యారా' మొదటి స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో కాంతార ఛాప్టర్ 1, కూలీ, వార్ 2 వంటి సినిమాలు కూడా ఉన్నాయి.
2025 చివర్లోకి వచ్చేసింది కాబట్టి లెక్కలన్నీ బయటికి వస్తున్నాయి. ఈ ఏడాది సినిమాను ఎక్కువ మంది సర్చ్ చేసారు.. ఏ సినిమా కోసం గూగుల్‌ను అడిగారు అనేది లెక్కలు అధికారికంగా బయటికి వచ్చాయి. అందులో మన సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఆ టాప్ 10లో ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉండటం విశేషం. మరి గూగుల్ చెప్పిన డీటైల్స్ ఏంటో చూద్దామా.. గూగుల్‌లో 2025 టాప్ సర్చ్డ్ మూవీస్ లిస్ట్ విడుదలైంది. అందులో టాప్ 1లో ఉన్న సినిమా ఏంటో తెలుసా.. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సైయ్యారా. అహాన్ పాండే, అనీత్ జంటగా నటించిన ఈ చిత్రం 500 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా గురించే 2025లో నెటిజన్లు ఎక్కువగా సర్చ్ చేసింది.. అసలు ఎవరీ జంట.. ఏంటీ సినిమా అని సైయ్యారా గురించి తెలుసుకోడానికి పోటీ పడ్డారు. అత్యధికంగా సర్చ్ చేసిన టాప్ 2 సినిమా కాంతార ఛాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక టాప్ 3లో ఉన్న సినిమా కూలీ. రజినీకాంత్, లోకేష్ కాంబోలో రావడం.. నాగార్జున విలన్ కావడం కూలీకి కలిసొచ్చింది. టాప్ 4లో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ఉంది. గూగుల్ మోస్ట్ సర్చ్డ్ మూవీస్‌లో టాప్ 5లో ఉన్న సినిమా సనమ్ తేరీ కసమ్. హర్షవర్ధన్ రాణే-మావ్రా హోకేన్ నటించిన ఈ సినిమా రీ రిలీజ్‌లో 45 కోట్లకు పైగా వసూలు చేసింది.. దీనికోసం ఆడియన్స్ ఎక్కువగా వెతికారు. ఇక టాప్ 6లో మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ఇండియాగా నిలిచిన మార్కో ఉంది.. మలయాళంలో 100 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన హౌజ్ ఫుల్ 5 సినిమా అత్యధికంగా వెతికిన లిస్టులో 7వ స్థానంలో నిలిచింది. రెండు క్లైమాక్స్‌లతో రావడంతో ఈ సినిమా గురించి ఆసక్తిగా సర్చ్ చేసారు నెటిజన్లు. గూగుల్ సర్చ్‌లో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క తెలుగు సినిమా గేమ్ ఛేంజర్. టాప్ 8లో నిలిచింది ఈ చిత్రం. టాప్ 9లో మిసెస్, 10లో మహావతార్ నరసింహా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా
చైనా అమ్మాయి వెడ్స్ ఝార్ఖండ్ అబ్బాయి.. వీరి అద్భుత ప్రేమ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
పర్వతంపైకి తీసుకెళ్లి ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు.. చలికి గడ్డ కట్టి..
