సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు

Edited By:

Updated on: Mar 23, 2026 | 5:22 PM

వెండితెరపై కేవలం గ్లామర్‌ డాల్స్‌ అన్న ఇమేజ్‌ను చెరిపేస్తూ, తెలుగు నటీమణులు ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సమంత, నయనతార, వరలక్ష్మి శరత్‌కుమార్‌, నిహారిక వంటి తారలు తమ సొంత బ్యానర్లతో పవర్‌ఫుల్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్‌ నటనకు మించి హీరోయిన్ల నాయకత్వ పటిమను చాటుతూ, తెలుగు సినిమా భవిష్యత్‌ దిశను మార్చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెండితెర మీద హీరోయిన్ అంటే గ్లామర్‌ డాల్ అన్న ఇమేజ్‌కు తెర పడుతోంది. ఒకప్పుడు సామిత్రి, భానుమతి, విజయ నిర్మల లాంటి దిగ్గజాల తరహాలో ఈ జనరేషన్ బ్యూటీస్‌ కూడా యాక్టింగ్‌తో పాటు ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు ముఖ్యంగా నిర్మాతలుగా రిస్క్ చేసేందుకు సైతం రెడీ అంటున్నారు. అద్భుతమైన నటనతో పవర్‌ఫుల్ పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ సరస్వతి అనే కోర్ట్ రూమ్ డ్రామాతో డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమాను తన చెల్లెలు పూజతో కలిసి స్వయంగా నిర్మించారు వరలక్ష్మి. రీసెంట్‌గా మరో బ్యూటీ అదితిరావు హైదరీ కూడా త్వరలో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు. హెల్త్‌ ఇష్యూస్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌లో ఇబ్బందులతో ఆ మధ్య స్లో అయిన సమంత ఇప్పుడు అన్ని రకాలుగా పికప్ అవుతున్నారు. శుభం సినిమాతో నిర్మాతగా మారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు సొంత బ్యానర్‌లోనే మా ఇంటి బంగారం సినిమాను రూపొందిస్తున్నారు.సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న నిత్యమీనన్‌ కూడా నిర్మాతగా ప్రూవ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కేయూరి పేరుతో బ్యానర్‌ స్టార్ట్ చేసిన నిత్య, తన టేస్ట్‌కు తగ్గ సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. గతంలో స్కైలాబ్ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు ఈ బ్యూటీ. ఆల్రెడీ నిర్మాతగా బిజీగా ఉన్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఓ వైపు బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే.. మరో వైపు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసేలా సినిమాలు నిర్మిస్తున్నారు నయన్‌. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. రెగ్యులర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ల తరహాలో వరుస సినిమాలు లైన్‌లో పడుతున్నారు. నటనకు బ్రేక్ ఇచ్చిన మెగా డాటర్‌ నిహారిక, నిర్మాతగా బిజీ అవుతున్నారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో కమర్షియల్ సక్సెస్‌తో పాటు అవార్డులు కూడా సాధించిన ఈ బ్యూటీ త్వరలో రాకాస అనే హారర్‌ కామెడీ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాతో మరోసారి బిగ్ హిట్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇలా అందాల భామలు నిర్మాతలుగా మారుతుండటంతో ఈ ట్రెండ్ ఇంకొంత కాలం కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌ వైపు చూస్తున్న ధురంధర్‌ డైరెక్టర్‌.. లిస్ట్‌లో ఉన్న స్టార్స్‌ వీరే ??

Follow Us