నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Updated on: Mar 30, 2026 | 6:24 PM

"పుష్ప" తర్వాత టాలీవుడ్‌లో ఫహద్ ఫాజిల్ క్రేజ్ పెరిగింది. ఆయన నటనకు ప్రాణం పోసినా, ప్రస్తుతం భారీ పారితోషికంతో నిర్మాతలను షాక్ చేస్తున్నారు. విలన్ పాత్రలకు రూ. 15-20 కోట్లు డిమాండ్ చేస్తూ, చిత్ర నిర్మాణ సంస్థలకు సవాలు విసురుతున్నారు. ఈ అధిక డిమాండ్‌తో అనిల్ రావిపూడి, రామ్ వంటి వారి చిత్రాల నుండి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. ఇది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఫహద్ ఫాజిల్! ఇప్పుడు ఈయనతో ఓ చిక్కొచ్చిపడిందని మేకర్స్ ఫీలవుతున్నట్టు ఓ టాక్ నడుస్తోంది. తన యాక్టింగ్‌తో… చేసిన పాత్రలకు ప్రాణం పోసే ఫహద్.. ఈ కారణంతోనే మేకర్స్‌కు బెస్ట్ ఛాయిస్‌గా మారుతున్నారు. తమ సినిమాలో కాస్ట్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫహద్ మాత్రం.. నో చెప్పకుండా మేకర్స్‌ను డబ్బుతో కొడుతున్నాడు. తనకు నచ్చలేదా.. రెమ్యునరేషన్‌తో అందరికీ షాకిస్తున్నారు. ఆఫ్టర్ పుష్ప.. ఫహాద్ ఫాజిల్‌కు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో టాలీవుడ్ బడా నిర్మాతలంతా ఆయన కోసం క్యూ కడుతున్నారు. కానీ ఆయన మాత్రం భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాడట. హీరోగా కాకుండా విలన్‌గా నటించాలంటే.. రూ. 15-20 కోట్లు ఇవ్వాల్సిందేనని కండీషన్‌ పెడుతున్నాడట. అంత మొత్తంలో ఇచ్చుకోలేక.. నిర్మాతలకు వెనుకంజ వేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. తన లేటెస్ట్ సినిమాలో వెంకటేశ్‌తో పాటు ఫహద్‌ని కూడా మొదట అనుకున్నాడట అనిల్ రావిపూడి. అయితే పారితోషికం ఎక్కువగా డిమాండ్‌ చేయడంతో.. ఆ స్థానంలో కల్యాణ్‌ రామ్‌ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే రామ్‌ సినిమాలోనూ విలన్‌గా ఫహద్‌నే తీసుకోవాలనుకున్నారట. అక్కడ కూడా పారితోషికం విషయంలోనే ఇబ్బందులు ఎదురై.. చివరకు వదిలేశారట. తనకు తన క్యారెక్టర్ నచ్చకున్నా.. రొటీన్‌గా ఉన్నా.. నో చెప్పకుండా.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇలా తన వైఖరితో ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాడట ఈ ట్యాలెంటెడ్ యాక్టర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో అన్నమయ్య భారీ విగ్రహం..

తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పు

‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు

చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు

Follow Us