‘రమ్య మోక్షకు బిగ్‌బాస్ అన్యాయం ‘ : దువ్వాడ వీడియో

Updated on: Dec 25, 2025 | 11:31 AM

బిగ్ బాస్ సీజన్ 9 సెక్సెస్ ఫుల్‌గా పూర్తయిపోయింది. 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించింది. అందరూ ఊహించినట్టే కామనర్ కళ్యాణ్ పడాల ఈ సీజన్‌లో విన్నర్ గా నిలిచాడు. సీరియల్ నటి తనూజ రన్నరప్ గా నిలిచింది. సెకండ్ రన్నర్‌గా డిమాన్ పవన్‌ 15 లక్షల సూట్‌ కేస్‌తో బయటికి వచ్చాడు. ఈ క్రమంలోనే జరిగిన గ్రాండ్ ఫినాలేలో.. బిగ్ బాస్‌ హౌస్‌ కంటెస్టెంట్స్ అందరూ మళ్లీ కలిశారు. హంగామా చేస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం బిగ్ బాస్‌ పై ఓ కాంట్రో కామెంట్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్‌లో మాధురికి కాకుండా… ఓ కంటెస్టెంట్‌కు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆరోపించాడు.ఈ సీజన్‌లో వైల్డ్ స్ట్రామ్‌ వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్స్‌గా ఐదుగురు హౌస్‌లోకి వెళ్లారు. అందులో దివ్వెల మాధురితో పాటు రమ్య మోక్ష కూడా ఉన్నారు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో వారంలోనే రమ్య మోక్ష హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. రమ్య మోక్షకు అన్యాయం జరిగిందంటూ వీడియోను రిలీజ్ చేశాడు శ్రీనివాస్.’రమ్య మోక్షకు బిగ్ బాస్ టీమ్ అన్యాయం చేసింది. రమ్య కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి. తన కాళ్ల మీద తాను నిలబడిన ధైర్యవంతురాలు. అయితే.. ఈ సారి హౌస్‌లో అనవసరమైన ఉంచి.. రమ్య లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను తొందరగా బయటకు పంపేశారు.చిన్న చిన్నవాటికి ఆత్మహత్యలకు పాల్పడే నేటి యువత రమ్య‌ను చూసి చాలా నేర్చుకోవాలని, తన తండ్రి చనిపోయినా ఆ బాధ దిగమింగి ఆమె గట్టిగా పోరాడిందని ప్రశంసించాడు దువ్వాడ. దీంతో దువ్వాడ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో