Lucky Bhaskar 2: హై వోల్టేజ్ క్రైమ్ డ్రామాగా రాబోతున్న లక్కీభాస్కర్ 2

Updated on: Sep 06, 2026 | 12:15 PM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన లక్కీ భాస్కర్ విజయవంతం కావడంతో, దాని సీక్వెల్ లక్కీ భాస్కర్ 2 రాబోతోంది. ఈ సినిమా మరింత హై వోల్టేజ్ క్రైమ్ డ్రామాగా, సరికొత్త ఆర్థిక కుంభకోణాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీక్వెల్ పై దుల్కర్, వెంకీ ఇద్దరూ చాలా ఆసక్తిగా ఉన్నారు.

సాలిడ్ హిట్‌లు వచ్చినప్పుడు సీక్వెల్‌లు ప్లాన్ చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో సాధారణమైపోయింది. ఈ కోవలోకి మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన లక్కీ భాస్కర్ సీక్వెల్ వచ్చి చేరింది. ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ వెలువడింది. ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్‌గా ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుని అక్రమ మార్గాల్లో కోట్లకు పడగెత్తిన భాస్కర్ ప్రయాణం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. 1980-90ల నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, వెంకీ అట్లూరి టేకింగ్ మొదటి భాగాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ రెడీ అవుతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ఐయామ్ గేమ్ ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్, వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలోనే డైరెక్టర్ వెంకీ అట్లూరి సీక్వెల్‌కి సంబంధించి అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు. సీక్వెల్ విషయంలో దుల్కర్ కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. లక్కీ భాస్కర్ 2లో మరింత హై వోల్టేజ్ క్రైమ్ డ్రామా, సరికొత్త ఆర్థిక కుంభకోణాలు, ఊహించని మోసాల నేపథ్యంలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండబోతుందని సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ 7 రోజువారీ అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి.. లేకపోతే మీ మెదడు షెడ్డుకే..!

కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!

200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం.. ఆ కుటుంబం ఏం చేసిందో మీరే చూడండి!

బాస్‌.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్‌.. ఏకంగా ఇంటి పైకప్పుపై మహీంద్రా స్కార్పియో

స్పైడర్‌ మ్యాన్‌లా స్టంట్‌ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..

Loading...
Unable to load recommendations.
Follow Us