మిరాయ్ సినిమాలోరాముడిగా నటించిందెవరో తెలిసిపోయింది..

Updated on: Sep 16, 2025 | 6:18 PM

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటేస్ట్ మూవీ మిరాయ్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఇందులో మంచు మనోజ్, శ్రియా, రితిక నాయక్ కీలకపాత్రలు పోషించారు. సూపర్ హీరో తరహా జానర్ లో మూవీ తెరకెక్కించినప్పటికీ క్లైమాక్స్ లో శ్రీరాముడిని రిఫరెన్స్ గా చూపించడం జనాలకు తెగ నచ్చేసింది.

అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించాడని.. ఈ మూవీ విడుదలకు ముందు రమర్స్ వచ్చాయి. కానీ ఆ పాత్రను ఓ యువ నటుడు పోషించారు. దీంతో ఇప్పుడు అతడి గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే అతనెవరనేది బయటికి వచ్చింది. మిరాయ్‌ సినిమా చివర్లో వచ్చే శ్రీరాముడి పాత్ర కథను టర్న్ అయ్యేలా చేస్తుంది. రెండు నిమిషాలు ఉన్న ఆ పాత్రలో ముఖం కనిపించి కనిపించకుండా చూపించారు. దీంతో ఆ పాత్రను ఎవరు చేశారా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ పాత్రలో కనిపించిన నటుడి పేరు గౌరవ్ పోరా. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన గౌరవ్ మాస్ కమ్యూనికేషన్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. చదువు పూర్తి చేసిన అతడు ఢిల్లీ వచ్చేసి థియేటర్ గ్రూప్ లో చేరాడు. ఐదేళ్లపాటు హిందీలో పలు నాటకాలు వేశాడు. పలు షార్ట్ ఫిల్మ్స్, హిందీ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్.. కొన్ని కమర్షియల్ యాడ్స్ లోనూ నటించారు. ఇక ఇప్పుడు మిరాయ్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది. దీంతో గౌరవ్ కు ఇప్పుడు మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే! పాపం శ్రష్టి

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు.. గుడ్ న్యూస్!

దటీజ్ ప్రభాస్‌! మనోడి మంచి మనసుకు హ్యాట్సాఫ్‌

మిరాయ్‌ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్.. స్వయంగా లీక్ ఇచ్చిన కార్తీక్

నా తండ్రి తప్పుడు పని చేశాడు.. ఇంట్లో నుంచి గెంటేశా..

Published on: Sep 16, 2025 06:17 PM
Loading...
Unable to load recommendations.
Follow Us