Director Shankar: అబ్బో.. డబుల్ గేమ్ ఆడుతున్న శంకర్.. సెట్స్ మీద ఉన్న సినిమాపై ఫోకస్ తగ్గిందా..?
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డబుల్ గేమ్‌కు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న శంకర్.. నెక్ట్స్ మరో బిగ్ మూవీని పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. చెర్రీతో బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు.
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డబుల్ గేమ్‌కు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న శంకర్.. నెక్ట్స్ మరో బిగ్ మూవీని పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. చెర్రీతో బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. వింటేజ్ శంకర్‌ను గుర్తు చేసేలా… సోషల్ మెసేజ్‌ను, కమర్షియల్ ఫార్ములాను మిక్స్ చేసి ఈ సినిమా చేస్తున్నారు. అయితే శంకర్ ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా లైన్‌లో పెడుతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. నిజానికి రామ్ చరణ్ సినిమాకు ముందు కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమాను శంకర్ స్టార్ట్ చేశారు. కానీ ప్రొడక్షన్ హౌస్‌తో వివాదాలతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో చెర్రీ సినిమా లైన్‌లోకి వచ్చింది. కానీ రీసెంట్‌గా విక్రమ్ సక్సెస్‌తో కమల్ హాసన్ ఫామ్‌లోకి రావటంతో మళ్లీ ఇండియన్ 2 విషయంలో కదలిక వచ్చింది. ఈ సినిమాను రీస్టార్ట్ చేసేందుకు కమల్ ప్రయత్నాలు ప్రారంభించారు. దానికి తగ్గట్టే.. ఈ డైరెక్టర్ కు రాయభారం పంపారు.దీంతో శంకర్ కూడా.. ఇండియన్ 2ను కంప్లీట్ చేసేందుకు కమల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆల్రెడీ చెర్రీ సినిమా సెట్స్ మీద ఉంది. ఆ తరువాత రణవీర్ సింగ్‌తో అన్నియన్ రీమేక్ చేయాల్సి ఉంది. ఈ కమిట్మెంట్స్‌కు ఇబ్బంది కలగకుండా ఒకేసారి రెండు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ శంకర్. ఇలా డబుల్ గేమ్ ఆడుతూ.. సినిమా ఫినిష్ చేయాలని.. దిమ్మతిరిగే హిట్స్ కొట్టాలని ప్లాన్స్ వేస్తున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..