రూటు మార్చిన నాగ వంశీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో.. ఆంజనేయుడి యానిమేషన్ మూవీ
చడీచప్పుడు కాకుండా వచ్చిన మహాతార్ నరసింహ సూపర్ డూపర్ హిట్టైపోయింది. ఇండియన్ యానిమేటెడ్.. ఎపిక్ డివోషనల్ యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మేకర్స్‌కి కాసులు కురిపించింది. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది. దీంతో మేకర్స్ అందరూ ఈ తరహా సినిమాలు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న వేళ.. మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఏకంగా తన అప్ కమింగ్ 3d యానిమేషన్ సినిమా వాయుపుత్ర అంటూ.. ఓ పోస్టర్ ను రిలీజ్ చేశాడు.
యంగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సూర్ దేవర నాగవంశీ .. సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అడ్వాన్స్‌డ్ 3D యానిమేషన్ కాన్సెప్ట్‌తో… హనుమంతుని కాలాతీత కథను మరింత గొప్పగా ఆవిస్కరించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ చందూ మొండేటి. ఇక ఈ డైనమిక్ టీం రిలీజ్ చేసిన వాయు పుత్ర పోస్టర్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్నట్టు ఉన్న ఈ శక్తివంతమైన పోస్టర్.. ఈ సినిమా కాన్ఫెప్ట్‌ను అందరికీ చెప్పకనే చెబుతోంది. అయితే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అతి తక్కువ టైంలో … 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రొడ్యూసర్ నాగవంశీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘డాక్యుమెంటరీనే కాదు డబల్ హెడేక్’ చిక్కుల్లోకి నయన్.. హైకోర్టుకు కొత్త నోటీసులు
చిన్న జీతంతో సంతోషంగా బతికా.. ఇప్పుడు లక్షల జీతంతో నరకం చూస్తున్నా
పెళ్లిళ్లు ఆపేసిన మేకలు, గొర్రెలు.. కారణం ఇదే
Nepal: నెపో కిడ్ ఉద్యమం వెనుక ఆ వ్యక్తి
మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. కాపాడండి ప్లీజ్.. నేపాల్ లో భారత మహిళ ఆవేదన
