డైరెక్షన్‌కు అనిల్ గుడ్ బై చెబుతారా ?? వైరల్ అవుతున్న దిల్ రాజ్ కామెంట్స్
దిల్‌రాజు టాలెంట్ ఐడెంటిఫికేషన్‌లో సరికొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు. రెగ్యులర్ హీరోలతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌ను 'ఎల్లమ్మ' సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. అలాగే, అనిల్ రావిపూడిలో నటుడిని గుర్తించి ఆఫర్ ఇవ్వగా, ఆయన దర్శకత్వంపైనే దృష్టి సారించారు. ప్రదీప్ రంగనాథన్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇది దిల్‌రాజు కొత్త బిజినెస్ వ్యూహం, అతని "కిక్" కోసం చేసే ప్రయత్నం.
అందరూ ఐడెంటిఫై చేసిన దాంతో మనం బిజినెస్ చేస్తే కిక్ ఏం ఉంటుంది? మనం ఐడెంటిఫై చేయాలి.. మనం బిజినెస్ చేయాలి. క్లిక్ అవ్వాలి.. అప్పుడు కదా కిక్. ఇప్పుడు దిల్ రాజు అలాంటి కిక్కు కావాలని కోరుకుంటున్నారు. రెగ్యులర్ హీరోలతో సినిమాలు చేస్తూనే, కొందరిలో టాలెంట్ చూసి హీరోలుగా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఇంతకీ దిల్‌రాజు ఇచ్చిన లేటెస్ట్ స్టేట్‌మెంట్ ఏంటి? ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్‌తో ఎల్లమ్మ మూవీ తెరకెక్కిస్తున్నారు దిల్‌రాజు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చేస్తే చూడాలన్నది ఎప్పటి నుంచో అభిమానుల కోరిక. ఆయన స్టేజ్ షోలు చూసిన వారు చాలా కాలం క్రితమే.. ఇతను హీరో మెటీరియల్ అని చెప్పేశారు. వాళ్ల మాటను ఇప్పుడు నిజం చేసే పనిలో ఉన్నారు దిల్‌రాజు. అంతే కాదు, డైరక్టర్ అనిల్ రావిపూడిని కూడా హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తానంటున్నారు మిస్టర్ దిల్‌రాజు. అవకాశం వచ్చిన ప్రతిసారీ మెటీరియల్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. తన సినిమాలోనే ఎక్కడో ఓ చోట కాలు కదపడమో, ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడమో, ఏదో ఒక రకంగా కెమెరా ముందు తళుక్కుమంటూనే ఉన్నారు. జస్ట్ అంతే కాదు… సినిమా స్టోరీలను నెరేట్ చేసేటప్పుడు కూడా ఆయనలో నటుడు బయటకు వస్తాడన్నది దిల్‌రాజు చెప్పేమాట. అందుకే అనిల్‌తో సినిమా చేయడానికి తాను రెడీ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు ఏస్ ప్రొడ్యూసర్. అయితే, తాను డైరక్టర్‌గా కంటిన్యూ కావాలనుకుంటున్నట్టు తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చేశారు అనిల్ రావిపూడి. ప్రదీప్ రంగనాథన్‌తో దిల్‌రాజు ప్రొడక్షన్‌లో సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయ్యారు ఈ హిట్ మిషన్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: ప్రేమపై త్రిష పోస్టు.. ట్రెండింగ్ లో లవ్ కోట్స్
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్ కాదు.. కొత్తగా ప్యాచప్..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్