Dhurandhar 2: ధురంధర్ కెప్టెన్‌కి.. వర్మ వార్నింగ్.. జర భద్రం
ధురంధర్ 2 (ది రివెంజ్) ఈ నెల 19న విడుదల కానుంది. సినిమాపై భారీ హైప్ నెలకొంది. రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను ప్రశంసిస్తూనే, ఆయన కెరీర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనిల్ కపూర్ ధురంధర్ 2లో తనకు అవకాశం వచ్చిందని, డేట్స్ క్లాష్ వల్ల వదులుకున్నానని వెల్లడించారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది.
ధురంధర్ ది రెవెంజ్‌కి టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ఆసక్తికరమైన అంశాలు చాలానే బయటకు వచ్చేస్తున్నాయి. ఈ సినిమా తర్వాత డైరక్టర్ ఫ్లాప్‌ని జనాలు కోరుకుంటారని వర్మ అంటే, తనదాకా వచ్చిన ఛాన్సు గురించి చెప్పేశారు అనిల్. ధురంధర్ హైప్ మీద మనం కూడా ఓ లుక్ వేసేద్దామా… ఈ నెల 19న ధురంధర్2 రిలీజ్. అంతకన్నా ముందురోజు సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. ఈ సినిమా మీద హైప్ మామూలుగా లేదు. ఇప్పటిదాకా ఉన్న ఫిల్మ్ మేకింగ్ మొనాటనీని ఆదిత్యధర్ మార్చేశారంటూ ప్రశంసలు కురిపించారు రామ్‌గోపాల్ వర్మ. ధురంధర్ సీక్వెల్ తర్వాత ఆదిత్యధర్ కెరీర్‌లో ఫ్లాప్ కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుందని వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్టర్ ధురంధర్ రిలీజ్.. చాలా ప్యాన్ ఇండియా సినిమాలు రీషూట్‌లు చేసుకుంటున్నాయని ఆ మధ్య వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు ఫ్రెష్ గా వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్ మేకర్స్ ఇప్పటిదాకా ఉన్న మూస పద్ధతులకు స్వస్తి చెప్పి సరికొత్త స్క్రీన్ ప్లేలను నేర్చుకుని ముందుకు సాగాల్సిన టైమ్ అంటూ వర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని.. మూవీ రిలీజ్ టైమ్ లో గుర్తుచేసుకుంటున్నారు జనాలు. ధురంధర్2లో నన్ను నటించమని అడిగారంటూ ఓపెన్ అయ్యారు అనిల్ కపూర్. ఆదిత్య అడిగిన డేట్స్.. ఇతర సినిమాలతో క్లాష్ కావడంతో అవకాశాన్ని వదులుకున్నానని క్లారిటీ ఇచ్చారు. యానిమల్ సినిమాలో మెప్పించిన అనిల్.. ధురంధర్2లో ఉంటే భలే కిక్ వచ్చేదంటున్నారు నెటిజన్స్. సో, ధురంధర్ టీమ్ కాకపోయినా ఔట్‌సైడర్స్ చెబుతున్న మాటలతోనూ ట్రెండ్ అవుతోందీ సినిమా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం
Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా
Rashmika: రష్మిక కాక్‌టైల్ పార్టీ డేట్ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా
Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ
Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో మరింత జోష్… రికార్డులు బ్రేక్ అవుతాయా ??