Dhurandhar: టాప్‌లో దూసుకుపోతున్న ధురంధర్ ఫ్రాంఛైజీ
ధురంధర్ సినిమా ఫ్రాంచైజ్ ఇప్పుడు భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి ఇండియన్ ఫ్రాంచైజ్‌గా నిలిచింది. ఇదివరకటి బాహుబలి రికార్డును బద్దలు కొట్టి, పుష్ప, కేజీఎఫ్ వంటి చిత్రాలను అధిగమించి, ధురంధర్ తన సత్తా చాటింది. ఈ అద్భుత విజయం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ధురంధర్ సినిమా వార్తల్లో లేని రోజంటూ లేదు. మరి కలెక్షన్లు ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు టాక్ కూడా అదే రేంజ్‌లో ఉంటుందిగా అంటున్నారా? యస్.. ఒకటీ, రెండు కాదు.. ఏకంగా మూడు వేల కోట్లను దాటిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. మన సౌత్ హీరోల చిత్రాలతోనూ ఆల్రెడీ పోలిక మొదలైంది.. ఇంతకీ మన వాళ్లు ఎంతలో ఉన్నారంటారా? మాట్లాడుకుందాం వచ్చేయండి.. ధురంధర్ రెండు పార్టులు కలిపి మూడు వేల కోట్లను దాటేసిందన్నది ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్. ఈ మార్క్ ని క్రియేట్ చేసిన తొలి ఇండియన్ హయ్యస్ట్ గ్రాసింగ్ ఫ్రాంఛైజీ ప్రాజెక్ట్ గా అరుదైన రికార్డు సొంతమైంది ధురంధర్‌కి. ధురంధర్ ఈ మార్క్ రీచ్ కాగానే అందరి దృష్టీ ప్రీవియస్ మూవీస్ మీదకు మళ్లుతోంది. ఏ బిడ్డా ఇది నా అడ్డా.. అంటూ రూల్ చేసిన పుష్పరాజ్ ఎంత కలెక్ట్ చేశారని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. బన్నీ, రష్మిక, ఫాహద్ నటించిన ఈ మూవీ రెండు పార్టులూ కలిపి 2221 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప కన్నా ముందు రిలీజ్ అయిన బాహ ఉబలి సినిమా స్కోర్ 2438 కోట్లుగా తేలింది. కేజీయఫ్ సినిమాల సంగతేంటా అని ఆరా తీస్తే రెండు పార్టులూ కలిపి 1453 కోట్ల దగ్గర ఆగినట్టు కనిపిస్తోంది. సో.. మొన్న మొన్నటిదాకా బాహుబలి పేరు మీదున్న రికార్డుని ధురంధర్ క్రాస్ చేసేశాడని గట్టిగా చెబుతోంది ట్రేడ్ ఇండస్ట్రీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Devara: దేవర సెట్లో వారణాసి మూవీ షూటింగ్
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి
Srelelela: టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఇద్దరు హీరోయిన్లు
Salman Khan: వంశీ పైడిపల్లి మీదే హోప్స్ పెట్టుకున్న భాయీజాన్