Dhanush: అంతర్జాతీయ ఫిల్మ్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ధనుష్‌ సినిమా

|

Jun 15, 2024 | 11:31 AM

తమిళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా రాణిస్తున్న హీరో ధనుష్‌. కేవలం నటుడు మాత్రమే కాదు, సింగర్‌, దర్శకుడు, నిర్మాత, రచయిత కూడా. ఈ మల్టీ ట్యాలెంటెడ్‌ హీరోకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ప్రస్తుతం ఈ స్టార్‌ హీరో సినిమా ఒక అరుదైన రికార్డ్‌ సృష్టించింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ అంతర్జాతీయ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో నామినేట్‌ అయింది.

తమిళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా రాణిస్తున్న హీరో ధనుష్‌. కేవలం నటుడు మాత్రమే కాదు, సింగర్‌, దర్శకుడు, నిర్మాత, రచయిత కూడా. ఈ మల్టీ ట్యాలెంటెడ్‌ హీరోకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ప్రస్తుతం ఈ స్టార్‌ హీరో సినిమా ఒక అరుదైన రికార్డ్‌ సృష్టించింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ అంతర్జాతీయ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో నామినేట్‌ అయింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన సమయంలో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ధనుష్‌కు ఉన్న క్రేజ్‌తో ఆ మూవీ రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్‌ చేసింది. లండన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిందని తెలిపింది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం నామినేట్ అయినట్లు మేకర్స్‌ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ధనుష్ ప్రస్తుతం తన 50వ చిత్రం రాయన్‌కి దర్శకత్వం వహించి, నటించారు. ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయనున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌, నాగార్జున కథానాయకులుగా కుబేర చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kamal Haasan: మేకప్ కోసం 3 గంటలు కష్టం.. కమల్‌ ఓపికకు దండం !!

ఆ స్టార్ హీరోయిన్‌ NTRని మూడు సార్లు రిజెక్ట్ చేసిందట

వేదికపై మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పిన చిరు..

TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేసిన కల్కి! | NTRకి సైడ్ ఇచ్చిన పవర్ స్టార్

Follow us on