డీమాన్‌ని ఢీ కొట్టి బొక్కబోర్లా పడ్డ కళ్యాణ్.. తనూజ దెబ్బకు షాక్‌లోకి

Updated on: Dec 17, 2025 | 12:54 PM

రీతూ చౌదరి ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్‌లో డీమాన్ పవన్ దూకుడు పెరిగింది. 'పిక్ ది బోన్' టాస్క్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. కళ్యాణ్‌తో పోటీ పడుతూ బోన్‌ని గెలిచాడు. డీమాన్ పవన్ హౌస్‌మేట్స్‌తో సరదాగా ఉంటూనే, టాస్కుల్లో తన సత్తా చాటుతున్నాడు. పవన్ అద్భుతమైన ఆట తీరు బిగ్‌బాస్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

రీతూ చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి డీమాన్ పవన్ దూకుడు వేరే లెవల్లో ఉంది. హౌస్‌మేట్స్‌తో జోకులు, టాస్కుల్లో నో బ్రేకులు అన్నట్లుగా డీమాన్ దూసుకుపోతున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన రెండు టాస్కుల్లోనూ డీమాన్ పవన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ ఎపిసోడ్‌లో ‘ఒన్స్ మోర్ ఒన్ లాస్ట్ టైమ్‌’లో భాగంగా పోటీదారులకి ‘పిక్ ది బోన్’ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. వివిధ రౌండ్స్‌లో ఈ టాస్క్ జరిగింది తాళ్లతో ఏర్పాటు చేసిన ఉచ్చును.. దారిలో అడ్డంగా ఉన్న టైర్లను.. ఉడెన్ ప్లాంక్స్‌ని దాటుకొని వెళ్లి.. బోన్‌ని ఎవరు పట్టుకుంటే వాళ్లు ఆ రౌండ్ విన్నర్ అవుతారు. ఈ టాస్కు తొలి రౌండ్‌లోనే డీమాన్ చకచకా వెళ్లి బోన్‌ని అందుకున్నాడు. అయితే చేతిలో ఉన్న బోన్‌ని లాక్కొని ఇది నాది అంటూ సంజన సరదాగా చెప్పింది. దీంతో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ పట్టుకున్నావంటే నీకు చూపిస్తా.. అంటూ డీమాన్ కూడా అన్నాడు. తర్వాత సెకండ్ రౌండ్‌లో కళ్యాణ్ విన్ అయ్యాడు. ఇక మూడో రౌండ్‌లో కళ్యాణ్-డీమాన్ ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారు. కానీ డీమాన్ చేతికి బోన్ దక్కగా కళ్యాణ్ కర్ర తగిలి బొక్కబోర్లాపడ్డాడు. దీంతో సంచాలక్ తనూజ తెల్లమొహం వేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: పవన్‌ డ్యాన్స్‌ ఎఫెక్ట్‌ షేక్ అవుతున్న సోషల్ మీడియా..

Akhanda 2: అఖండ2 థియేటర్లో అఘోరాలు.. వైరల్‌గా వీడియో..

Top9 ET News: సుజీత్‌కు పవర్ స్టార్ రెండున్నర కోట్ల కానుక

సీన్‌ రివర్స్‌… ఓటింగ్ ఫలితాల్లో భారీ తేడా

గజ..గజ.. గజ.. ఇంత చలి ఎప్పుడూ లేదయ్యో..