Vijay: ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత.. అరుదైన రికార్డు దిశగా సీఎం విజయ్!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమా విడుదల చేస్తున్న అరుదైన ఘనతను తమిళనాడు సీఎం విజయ్ సొంతం చేసుకోనున్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత ఈ జాబితాలో చేరనున్న ఆయన నటించిన ‘జన నాయకన్’కు సీబీఎఫ్‌సీ ‘A’ సర్టిఫికెట్ లభించింది. జూలై 24న విడుదలకు మార్గం సుగమం కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. సినిమా విడుదలపై విజయ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం.
సినిమాల్లో ఉన్నపుడైనా.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతైనా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నారు విజయ్. ఆయన అడుగు పెడితే ఏదో ఓ రికార్డ్ అన్నట్లుంది పరిస్థితి. తాజాగా మరో అరుదైన రికార్డు వైపు విజయ్ అడుగులు పడుతున్నాయి. అప్పట్లో NTR, MGR తర్వాత ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ అది. మరి అదేంటో తెలుసా..? రాజకీయాల్లో అత్యున్నత పదవిలో ఉంటూనే వెండితెరపై సందడి చేయడం అంటే అరుదైన విషయమే. అందరికీ సాధ్యం కాదది. మన దగ్గర కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. వాళ్లలో ఒకరు ఎంజీ రామచంద్రన్ కాగా.. మరొకరు నందమూరి తారక రామారావు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా వీళ్ళ సినిమాలు థియేటర్లలో సందడి చేసాయి. MGR సీఎం అయ్యాక ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో పాటు మరో మూడు సినిమాలు చేసారు. ఈ దిగ్గజాల సరసన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా చేరనున్నారు. ఆయన జన నాయకుడు త్వరలోనే రానుంది. జన నాయగన్ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా గత ఆర్నెళ్లుగా సెన్సార్ బోర్డు వద్దే ఆగిపోయింది. నిర్మాత చేసిన సుదీర్ఘ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించడంతో సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ఇచ్చారు. జూలై 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమే.. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఈ సమాచారం కూడా వెళ్లింది.
విజయ్ సినిమా వస్తుండటంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఇక తన సినిమా విడుదల వ్యవహారంలో విజయ్ పర్టిక్యులర్‌గా ఉన్నారు. సామాన్య ప్రేక్షకులు ఇబ్బంది పడకూడదని ఆయన భావిస్తున్నారు. బ్లాక్ టికెట్స్ నుంచి అదనపు రేట్ల వరకు అన్ని విషయాలపై విజయ్ చాలా క్లారిటీతో ఉన్నారు. మొత్తానికి నాయకుడు వచ్చాక ఏం చేస్తాడనేది చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్ ఖాతాలోకి వచ్చింది!