జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్ హైదరాబాద్ నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరుకు పయనమయ్యాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం, బ్రాహ్మణపల్లి సమీపానికి వచ్చే సరికి ఓ పెద్దాయన రోడ్డు మీద తీవ్రమైన గాయాలతో పడి ఉన్నాడు. ఇది చూసిన జానీ మాస్టర్.. గాయపడిన పెద్దాయనకు సాయం చేశాడు.
గాయాలతో ఉన్న ఆ పెద్దాయనను ఓదార్చి ధైర్యం చెప్పాడు. ఆ వెంటనే 108కి ఫోన్ చేశారు. 108 అంబులెన్స్ వచ్చేవరకు ఆ పెద్దాయన దగ్గరే ఉన్న జానీ మాస్టర్.. స్వయంగా ఆయన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జానీని విమర్శిస్తున్న కొంత మంది నెటిజన్లతోనే చప్పట్లు కొట్టించేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.