Pandu on Chaitanya: అప్పులే కారణం కాకపోవొచ్చు.. ఎవరి దగ్గర చైతన్య ఏమీ ఆశించేవాడు కాదు..!

|

May 02, 2023 | 10:00 AM

కొరియోగ్రాఫర్ చైతన్య మరణం బుల్లితెరను విషాదం ముంచెత్తింది. చనిపోయే ముందు చైతన్య తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో చైతన్య.. అప్పు ఇచ్చినవాళ్ల నుంచి ఇబ్బంది ఎదురవుతుందని.. తల్లిదండ్రులను, మిత్రుల్ని క్షమాపణలు అడిగి.. ఎంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.

కొరియోగ్రాఫర్ చైతన్య మరణం బుల్లితెరను విషాదం ముంచెత్తింది. చనిపోయే ముందు చైతన్య తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో చైతన్య.. అప్పు ఇచ్చినవాళ్ల నుంచి ఇబ్బంది ఎదురవుతుందని.. తల్లిదండ్రులను, మిత్రుల్ని క్షమాపణలు అడిగి.. ఎంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. వీడియోలో చైతన్య చెప్పిన మాటలు అందర్నీ కలచివేస్తున్నాయి. కొన్ని షోలు నేమ్‌తో పాటు ఫేమ్ ఇస్తాయి. కానీ సంపాదన తక్కువగా ఉంటుందన్నాడు. అయినా కష్టపడ్డాం.. నిలబడ్డాం.. అని చెప్పుకుంటూనే ఎమోషనల్ అయ్యాడు.అయితే ఫ్రెండ్స్ మాత్రం చైతన్య మాటల్ని పూర్తిగా నమ్మడం లేదు. చనిపోయేంత ఆర్థిక సమస్యలు చైతన్యకు లేవంటున్నారు. అదే నిజమైతే తామంతా సాయం చేసేవాళ్లమంటున్నారు. ఓ షోకి సంబంధించి టైటిల్ మిస్‌ అయిందన్న బాధతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటున్నారు మరికొందరు మిత్రులు. ఆర్థిక సమస్యల్ని ఎప్పుడూ తమతో చెప్పలేదని.. ఎవరి దగ్గర చైతన్య ఏమీ ఆశించేవాడు కాదన్నారు బంధువులు. ఇంతకీ చైతన్య ఎందుకు చనిపోయాడు? సన్మానం జరిగిన మరుసటి రోజు ఎందుకు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేకపోయాడా.. ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నట్టు వేరే కారణాలు ఉన్నాయా? మొత్తానికి చైతన్య మరణం బుల్లితెరను విషాదంలోకి నెట్టివేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!