బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ను మించేలా.. చిరు స్పెషల్ షో..
మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని అనుభవాలను, సంగతులను పంచుకునేందుకు పాడ్‌కాస్ట్ ప్రారంభించనున్నారు. 'శంకర వర ప్రసాదు' సక్సెస్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న చిరు, తన గొంతుతో ఈ తరానికి స్ఫూర్తినివ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే బాలయ్య 'అన్‌స్టాపబుల్'తో దుమ్మురేపుతుండగా, చిరు షో దానిని మించిపోతుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మెగా సుస్మిత ప్రీ-ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఈ పాడ్‌కాస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆఫ్టర్ మన శంకర వర ప్రసాదు సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న మెగాస్టార్ చిరు.. ఇప్పుడు ట్రెండ్‌ను ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట చిరు. నాలుగు దశాబ్దాల తన సినీ రంగ ప్రయాణంలోని సంగతులను, విశేషాలను , తన అనుభవాలను.. ఈ తరానికి తన గొంతుతో వినిపించాలని చిరు చూస్తున్నారట . ఇందుకు పాడ్ కాస్ట్ అయితే బెస్ట్ వేదికని ఆయన డిసైడ్ అయ్యారని.. ఇందుకోసం మెగా సుస్మిత ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని ఇన్ సైడ్ టాక్. ఇక ఇప్పుడు చిరు నిర్ణయంతో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే బాలయ్య ఆహాలో.. అన్‌స్టాపబుల్ షో చేస్తున్నారు. ఇప్పుడు చిరు కూడా పాడ్ కాస్ట్ షో చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో చిరు షో ఎలా ఉండనుందనే క్యూరియాసిటీ ఇప్పుడు అందర్లో ఉంది. అంతేకాదు బాలయ్య అన్‌స్టాపబుల్ షోను మించేలా.. చిరు స్పెషల్ షో ఉండనుందనే కూడా ఫిల్మ్ నగర్లో వినిపిస్తుండడం.. ఇప్పుడు అంతటా ఇంట్రెస్టింగ్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jyothika: ఆ చెడ్డ అలవాటు మానకపోవడం వల్లే తరుచూ మా మధ్య గొడవ
Vijay Deverakonda: 2026లో కొడితే.. డబుల్ ధమాఖానే..
TOP 9 ET: మారుతీకి అండగా పెద్ద సంస్థతో సినిమా సెట్ చేసిన ప్రభాస్
