ఉపాసన గుడ్ న్యూస్‌ చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి

|

Jan 03, 2023 | 9:33 AM

చెర్రీ ఎప్పుడు ఎప్పుడు.. తండ్రి అవుతారని.. తన నుంచి గుడ్ న్యూస్‌ ఎప్పుడొస్తుందని వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్‌కు ... ఇటీవలే గుడ్ న్యూస్‌ చెప్పారు చరణ్‌.

చెర్రీ ఎప్పుడు ఎప్పుడు.. తండ్రి అవుతారని.. తన నుంచి గుడ్ న్యూస్‌ ఎప్పుడొస్తుందని వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్‌కు … ఇటీవలే గుడ్ న్యూస్‌ చెప్పారు చరణ్‌. తను తండ్రిగా ప్రమోషన్ అందుకోబోతున్నట్టు తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఓ పోస్ట్ చేశారు. చెర్రీతో పాటు.. చిరు కూడా ఇదే విషయాన్ని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ తో పంచుకుని మురిసిపోయారు. అయితే ఈ విషయం బయటెప్పుడూ మాట్లాడని చిరు.. ఈ గుడ్ న్యూస్‌ తెలియాగానే ఎలా ఫీలయ్యారనేది చెప్పారు. రీసెంట్ ఇంటర్య్వూలో తను పొందిన ఆనందాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. “ఈ శుభ వార్త కోసం మేం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ట్రిపుల్ ఆర్ జపాన్‌ టూర్ ముగించుకుని వచ్చాక శుభవార్త చెప్పేందుకు చరణ్, ఉపాసన మా ఇంటికి వచ్చారు. ఉపాసన తల్లి కాబోతుందని విని నేను, సురేఖ సంతోషించాం. కన్నీళ్లు వచ్చేశాయి. ఉపాసనకు మూడో నెల వచ్చాక ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాం.” అని చెప్పారు చిరు. ఈ మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tholi Prema: ఫ్యాన్స్‌కు డబుల్ ఖుషీ.. రి-రిలీజ్‌కు తొలిప్రేమ కూడా !!

Pawan Kalyan: థియేటర్లో మంట పెట్టిన పవన్‌ ఫ్యాన్స్ !!

Published on: Jan 03, 2023 09:33 AM