Mega 158: పూజా కార్యక్రమాలతో మొదలైన మెగా 158

Edited By:

Updated on: May 22, 2026 | 4:23 PM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ ఘనంగా ప్రారంభమైంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి ఈ కాంబో మాస్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్లిమ్ లుక్‌లో కనిపించనున్న చిరంజీవి కోసం భారీ ప్లానింగ్ చేస్తున్నారు మేకర్స్. మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం మధ్య ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మేకోవర్‌ వీడియోతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీకిగా మారిన మెగా 158 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. గతంలో చిరు హీరోగా వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం స్లిమ్‌ లుక్‌లోకి మారిపోయారు చిరు. మెగా 158 మూవీ తొలి షాట్‌కు పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌ కొట్టగా, వివి వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. మెగా డాటర్‌ సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకులు బి గోపాల్‌, కోదండ రామిరెడ్డితో కలిసి మెగా బ్రదర్‌ నాగబాబు.. దర్శకుడు బాబీకి స్క్రిప్ట్ అందించారు. వాల్తేరు వీరయ్య సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించిన బాబీ, మెగా 158ను కూడా అదే స్టైల్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ విషయంలో కూడా పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు బాబీ. మే 21న పూజ చేసి.. 22 నుంచే రెగ్యులర్ షూట్‌కు వెళ్తున్నారు మేకర్స్. సంక్రాంతికి ఇంకా 7 నెలలు టైమ్ ఉంది.. గతేడాది మన శంకరవరప్రసాద్ గారు సినిమాను కూడా ఇలాగే స్టార్ట్ చేసి పూర్తి చేసారు చిరు. బాబీ సినిమాకు ఇదే అప్లై చేయాలని చూస్తున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూద్దాం..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: జస్ట్ మిస్.. లేదంటే.. వీర భద్రుడిగా బన్నీ రెచ్చిపోయేవాడే

Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ

Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్‌ హీరో!

Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్

Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్

Follow Us