రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్ వీడియో
ఇప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్లకు ఓటీటీ రైట్స్ బిగ్ బోనస్‌గా మారుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందే ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అంతేకాదు నష్టాల బాధ నుంచి.. ప్రొడ్యూసర్లను కాపాడుతున్నాయి. దీంతో ఓ సినిమాను మొదలెట్టే క్రమంలో ఓటీటీ డీల్స్ కోణంలో కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రోషన్ ఛాంపియన్ సినిమాకు కూడా రికార్డ్ రేంజ్ ధరకు ఓటీటీ హక్కులు పలికాయనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం.. ఛాంపియన్. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలోనే ఛాంపియన్ మూవీకి రిలీజ్‌కు ముందే ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను… ఓ ఓటీటీ సంస్థ.. దాదాపు రూ.16 కోట్లకు దక్కించుకున్నట్టుగా టాక్ బయటికి వచ్చింది. పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ రేంజ్‌లో డీల్ సెట్ చేశారంటే మూమూలు విషయం కాదనేది ఫిల్మ్ అనలిస్టులు కామెంట్.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
