Brahmastra 2: బ్రహ్మాస్త్ర సీక్వెల్ షూటింగ్ అప్‌డేట్ రివీల్
బ్రహ్మాస్త్ర పార్ట్ 2 షూటింగ్ ఆలస్యం కానుంది. నమిత్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం మేకర్స్ రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమాపై దృష్టి సారించారు. దీపావళికి రామాయణం పార్ట్ 1 విడుదల కానుంది. బ్రహ్మాస్త్ర తదుపరి భాగం చిత్రీకరణ రామాయణం పూర్తయ్యాకే మొదలవుతుందని ఆయన తెలిపారు. తారాగణంపై ఇంకా స్పష్టత లేదు.
నార్త్ సీక్వెల్స్ గురించి ప్రస్తావన రాగానే సౌత్ వాళ్లకి కూడా ఇమీడియేట్‌గా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ బ్రహ్మాస్త్ర. ఆల్రెడీ ఫస్ట్ పార్టుతో మన కింగ్ కూడా నార్త్ లో సూపర్ డూపర్ అనిపించుకున్నారు. అమితాబ్ అండ్ అదర్స్ కలిసిన ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు రానుంది? చూసేద్దాం వచ్చేయండి… బ్రహ్మాస్త్ర సెకండ్ పార్టు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పటి నుంచో అస్త్రవర్స్ లవర్స్ ని వెంటాడుతున్న ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ ఇచ్చేశారు నమిత్ మల్హోత్రా. ఫస్ట్ రామాయణని కంప్లీట్ చేశాకే బ్రహ్మాస్త్ర సినిమా షూట్ అని క్లారిటీ ఇచ్చేశారు. బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్టులో ఉన్న వాళ్లందరూ సెకండ్ పార్టులోనూ కనిపిస్తారా? కొత్తగా ఇంకెవరైనా యాడ్ అవుతారా? అనే ప్రశ్నలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం రామాయణ మీదే ఉంది. వరల్డ్ క్లాస్ ప్రాడెక్ట్ ని డెలివరీ చేయడానికి రెడీ అవుతున్నామని అంటున్నారు మేకర్స్. ప్రస్తుతం రణబీర్ హీరోగా రామాయణ మూవీని నిర్మిస్తున్నారు. ఈ దీపావళికి ఫస్ట్ పార్టును, వచ్చే దీపావళికి సెకండ్ పార్టును రివీల్ చేస్తారు. ఇందులో మర్యాదపురుషోత్తముడిని ఎలా చూపిస్తారు? రావణబ్రహ్మను ఎలా ఎలివేట్ చేస్తారనే విషయం మీద ఇప్పటికే చర్చ షురూ అయింది. కాసింత ఓపిక పట్టండి… మీరే విట్‌నెస్ చేద్దురుగానీ అని ఊరిస్తున్నారు మేకర్స్
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar: టాప్‌లో దూసుకుపోతున్న ధురంధర్ ఫ్రాంఛైజీ
Devara: దేవర సెట్లో వారణాసి మూవీ షూటింగ్
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి
Srelelela: టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఇద్దరు హీరోయిన్లు
Salman Khan: వంశీ పైడిపల్లి మీదే హోప్స్ పెట్టుకున్న భాయీజాన్