బాలీవుడ్‌ రామాయణలో శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయన్ ??

Updated on: Jun 16, 2025 | 8:35 PM

సినిమాల్లో గ్లామర్ డాల్‌గా మాత్రమే ఇన్నాళ్లూ కనిపించారు రకుల్ ప్రీత్ సింగ్. అందరూ హీరోయిన్లు ఆఫ్ బీట్ సినిమాలు చేసే ప్రయత్నాలు మొదలెట్టినా.. తాను మాత్రం క్యాజువల్‌ గ్లామర్ రోల్స్‌ మాత్రమే చేస్తూ వచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్ , ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన రూట్ మార్చారు.

తనకోసం వెతుక్కుంటూ వచ్చిన ఓ రాక్షస క్యారెక్టర్‌కు ఓకే చెప్పారు. తన నిర్ణయంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న రకుల్.. బాలీవుడ్ మేకర్ నితిష్‌ తివారీ డైరెక్టర్‌ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ రామాయణలో భాగం కాబోతున్నారు. పెళ్లాడమంటూ.. రాముడి వెనక పడే.. రావణాసురిడి చెల్లె, శూర్పణఖ పాత్రలో రకుల్ కనిపించనున్నారు. రణ్ భీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా… రాకింగ్ స్టార్ యష్‌ రావణాసురిడిగా నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్‌ సినిమాలో శూర్పణఖగా ఓ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని.. డైరెక్టర్ నితీష్ తివారి ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే ఈ రోల్‌కు రకుల్‌ను అప్రోచ్ అయ్యారట. అయితే ఈ మూవీ స్పాన్ అండ్ క్రేజ్‌ తెలిసిన రకుల్.. రాక్షస పాత్ర అని కూడా ఆలోచించకుండా ఓకే చెప్పాట. తొందర్లో ఈ మూవీ షూట్‌లో కూడా పాల్గొనబోతున్నారట ఈమె. అయితే అఫీషియల్‌గా ఈ విషయం బయటికి రానప్పటికీ.. బాలీవుడ్ మీడియా ఇదే విషయాన్ని కాస్త గట్టిగా చెబుతోంది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ వైరల్ అవుతోంది. నటిగా తనను తాను ప్రూఫ్ చేసుకుఏనే మంచి అవకాశం రకుల్‌కు వచ్చిందనే కామెంట్‌ వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా..?

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

సూది అవసరం లేకుండా రక్త పరీక్షలు.. AIతో టెస్టులు రిపోర్టులు..