Kiara Advani: కియారా లుక్‌కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి, గర్భం దాల్చి మళ్లీ సెట్స్‌కు వస్తున్న తారలు కియారా, ఆలియా, దీపిక ఫిట్‌గా ఎలా ఉంటున్నారు? ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మునుపటి ఫిజిక్‌ను ఎలా కొనసాగిస్తున్నారు? వారి వృత్తి నిబద్ధత, ఫిట్‌నెస్ ట్రైనింగ్, కుటుంబ మద్దతే దీనికి కారణమని ఈ కథనం వివరిస్తుంది. ఆడపులిలా మారానని కియారా అంటుండగా, ఆలియా కుటుంబ సహకారాన్ని గుర్తుచేసుకున్నారు.
కెరీర్ పీక్స్ మీదున్నప్పుడు పెళ్లి చేసుకోవడం, వెంటనే గర్భం దాల్చడం, కొన్నాళ్లకు మళ్లీ సెట్స్ మీదకు వచ్చేయడం.. మరి ఈ ప్రాసెస్ వాళ్ల ఫిజిక్‌ని ఎఫెక్ట్ చేస్తుందా? గతంలో ఉన్నంత ఫిట్‌గా కనిపిస్తున్నారా? వై నాట్ అంటున్నారు మన నాయికలు. హాయిగా తమ పని తాము చేసుకుపోవడానికి రెడీ అవుతున్నారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ రీసెంట్‌గా ఓ అవార్డుల వేడుకకు హాజరయ్యారు కియారా అద్వానీ. మునుపున్నంత ఫిట్‌గా ఉన్న ఆమెని చూసి వావ్ అనకుండా ఉండలేకపోయారు జనాలు. అలా ఎలా సాధ్యం అంటూ ఆరా తీసే వాళ్ల సంఖ్య కూడా చాలానే ఉంది. పాప పుట్టాక ఆడపులిగా మారానంటున్నారు కియారా. కెరీర్ పరంగా తానెప్పుడూ ప్రొఫెషనల్‌గానే ఉంటానని, ఆ ప్లానింగ్ ఇప్పుడు చాలా ఉపయోగపడుతోందన్నారు. సినిమాలు చూడటం, సినిమాల గురించి మాట్లాడటం, షికార్లకెళ్లడం.. ఎందులోనూ మార్పు రాలేదన్నారు. మరింత ఫిట్‌గా ఉండాలన్న ఉత్సాహం వస్తోందన్నారు మిసెస్ మల్హోత్రా. పాప పుట్టార ఆలియా కూడా మునుపటిలాగా మారారు. స్క్రీన్ మీద ఏమాత్రం మార్పు లేకుండా మెప్పించారు ఆలియా. అందుకు ఫిట్‌నెస్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడిందని, ఫ్యామిలీ సపోర్ట్ మర్చిపోలేనని చెప్పారు ఆలియా. పాప పుట్టాక ఇంట్లో కాసింత ఎక్కువ సమయాన్ని గడిపిన లేడీ దీపిక పదుకోన్. జీవితం మునుపటిలా లేదన్నారు దీపిక. ప్రపంచం అంతా పాప చుట్టూనే ఉన్నట్టుందని చాలా సార్లు షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం దీపికకు మల్టిపుల్ ప్రాజెక్టులు సెట్స్ మీదున్నాయి. మరి వీటితో ఈ బ్యూటీ ఎలా అలరించడానికి సిద్ధమవుతున్నారో లెట్స్ వెయిట్ అండ్ సీ…
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!
పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు