వామ్మో.. బిగ్ బాస్ హౌస్‌లో పాములు వీడియో

Updated on: Oct 20, 2025 | 12:04 PM

బిగ్‌బాస్‌ తెలుగు మాజీ కంటెస్టెంట్‌ యాంకర్‌ హరితేజ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ లోనావాలా అడవిలో జరిగిందని, అప్పట్లో పాములు, పులుల శబ్దాలు వినిపించేవని ఆమె తెలిపారు. రెండుసార్లు పాల్గొన్న తర్వాత షోపై ఆసక్తి తగ్గి, ఇంకెప్పుడూ హౌస్‌లోకి వెళ్ళనని షాకింగ్‌గా పేర్కొన్నారు.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే ఆరో వారానికి చేరుకుంది. కంటెస్టెంట్లు తమ గేమ్‌ స్ట్రాటజీలను పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్ల ఎంట్రీతో హౌస్‌లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ యాంకర్‌ హరితేజ బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకటి కాదు, రెండుసార్లు బిగ్‌బాస్‌ హౌస్‌లో సందడి చేసిన ఆమె, ఇంకెప్పుడూ హౌస్‌లోకి వెళ్ళనంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హరి తేజ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొనగా, గతేడాది సీజన్‌ 8లో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

హైదరాబాద్‌ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్‌ వీడియో

ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా

డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో