Bigg Boss 9: సంజన Vs లక్స్ పాప.. షాంపూ బాటిల్ కారణంగా.. రచ్చ రచ్చ లొల్లి!
బిగ్బాస్ సీజన్ 9 మొదటి రోజు నుంచే గొడవలతో స్టార్ట్ అయ్యింది. ఇక ఫస్డ్ వీక్ నామినేషన్స్ మాత్రం అంతగా హిటెక్కించేలా జరగలేదు. ఆమె నాతో మాట్లాడలేదు. తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు. ఇలా... మొదటి రోజు నుంచే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ అందరికీ విసుగు తెప్పిస్తూ అడియన్స్ దృష్టిలో పడిన సంజన... ఈ సారి హౌస్‌లో ఉన్న అందరికీ టార్గెట్ అయింది.
దీంతో అందూరు కూడబలుక్కుని.. ఆమెనే నామినేట్ చేశారు. ఈక్రమంలోనే లెటెస్ట్ ఎపిసోడ్‌లో… సంజన తన వింత వాదనతో అందరికీ చిరాకు తెప్పించింది. మరీ ముఖ్యంగా సంజన దెబ్బకు ఫ్లోరా అలియాస్ లక్స్ పాప అయితే కన్నీళ్లు పెట్టుకుంది. బాత్‌రూంలో షాంపూ, కండీషనర్ పెట్టకండి.. బయట పెట్టుకోండి అంటూ ఫ్లోరా చెబుతుంటే.. నావే.. ప్రతిసారి బయటకు తీయాలా.. అక్కడ ఉండనివ్వండి అంటూ అడ్డంగా వాదించింది సంజన. దీంతో విసుగొచ్చిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా.. బాత్‌రూం క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా.. ? అని నిలదీసింది. దీంతో ఫ్లోరాపై సంజన ఫైర్ అయ్యింది. మ్యానర్స్ లేదు.. అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టేసింది. సంజన హార్డ్ హిట్టింగ్ మాటలకు … ఆమె రియాక్షన్‌కు … ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో పాటే.. ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో సంజనా మరింతగా ఫైర్ అయ్యింది. ఏమన్నావ్.. ఫుటేజ్ కోసమా.. నా ముందు వేలు చూపించి మాట్లాడకు అంటూ లక్స్ పాపకు వార్నింగ్ ఇచ్చింది. చీప్ అంటూ మాట్లాడింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ దగ్గర శ్రీజను చూపిస్తూ అది సైకో.. దాన్ని చూస్తేనే చిరాకు అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూటమి ఐక్యతను చాటిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ
వినాయకుడి అన్నదానంలోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానం
