నల్గొండ కేతమ్మకు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

Updated on: Sep 03, 2025 | 6:25 PM

మరో వారం రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 ప్రారంభం కాబోతుంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్ లోకి రానున్నారు. ఇందులో భాగంగానే కామనర్స్ ఎంట్రీ కోసం అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ విన్నర్లు అభిజిత్, బిందు మాధవి అలాగే నవదీప్ ఈ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

అలాగే శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది. తాజాగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ప్రముఖ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ వచ్చారు.సెప్టెంబర్ 5న తన ఘాటి సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ అగ్నిపరీక్షకి వచ్చారు. ఈ సందర్భంగా అగ్ని పరీక్ష కాంటెస్ట్ కు ఎంపికైన కంటెస్టెంట్ల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. తెలుసుకోవడమే కాదు.. ఈ షోకి వచ్చిన కేతమ్మకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు క్రిష్‌. షోలో… కంటెస్టెంట్స్‌ మధ్య టాస్కులు నడుస్తున్న క్రమంలో… నవదీప్జ.. కంటెస్టెంట్స్ అందరికీ ఓ ఛాలెంజ్ విసిరాడు.‘మీలో ఎవరైనా సరే డేర్ చేసి నా ముఖం మీద నీళ్లు కొట్టాలి’.. అంటూ ఛాలెంజ్ చేశాడు. అయితే కంటెస్టెంట్స్ ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే తాను కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా నీళ్లు కొట్టేవాడ్ని అంటూ క్రిష్ చెప్పారు. దీంతో వెంటనే నల్గొండ కేతమ్మ క్రిష్ మాటలకు రియాక్టయ్యారు.యజమాని అంటే మనకి దేవుడు.. కొట్టలేం సార్ అని చెప్పారు. దేవుడు అంటున్నారు కదా శివుడి మీద నీళ్లు పోస్తున్నాం అనుకొని పోసేయండి.. ఆమెకు క్రిష్ కూడా రిప్లై ఇచ్చాడు. ఇక ఆ తర్వాత కేతమ్మ తన జీవితంలో పడిన కష్టాల గురించి పాట రూపంలో చెప్పింది. ఆమె ప్రతిభకు ఫిదా అయిన డైరెక్టర్ క్రిష్ ‘మీకు ఇష్టం ఉంటే నా నెక్ట్స్‌ చిత్రంలో మీ చేత ఓ చిన్న పాత్ర చేయిస్తాను’ అని ఆఫర్ ఇచ్చారు. ఇది వినగానే కేతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీరు వచ్చినప్పటి నుంచి ఏ భేషజాలు లేకుండా ఆటని ఆటలాగ చాలా చక్కగా ఆడుతున్నారు.. అన్నింటికంటే ఇసుమంత కూడా ఎక్కడా తగ్గకుండా వీళ్లందరూ ఒక ఎత్తు మీరు ఒక ఎత్తులా కనబడ్డారు.. అంటూ కేతమ్మ పై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి బిగ్ బాస్ లో వెళ్లినా, వెళ్లకపోయినా క్రిష్ తర్వాతి సినిమాలో నల్గొండ కేతమ్మ కనిపించనుందన్నమాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లోబోకు ఏడాది జైలు శిక్ష..! ఇద్దరి చావుకు కారణం..7 ఏళ్ల తర్వాత తీర్పు

భయానికే భయం పుట్టిస్తున్న హర్రర్ ఫిల్మ్.. అస్సలు మిస్ కావద్దు

ప్రభాస్‌ దెబ్బకు అరవ హీరో సైలెంట్ అవుతాడా ??

నా కొడుకు కాలు విరిగింది..! అంత బాధలోనూ నా జున్ను ఆ మాట అన్నాడు..

వాహనదారులకు గుడ్‌ న్యూస్‌..