రైతు బిడ్డ తర్వాత డప్పు బిడ్డ !! పాపం ఆగం చేశారుగా !!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్ ఏడో సీజన్ ఏడో వారంలోకి ప్రవేశించింది. అయితే ఆరో వారం ఎలిమినేషన్ మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పాపం సోషల్ మీడియా సెన్సేషన్ నయని పావని కేవలం ఒక్క వారానికే హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో మళ్లీ బిగ్ బాస్ ఓటింగ్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. బిగ్‌బాస్‌లో అంతా అగ్రిమెంట్ ప్రకారమే నడుస్తుందని ఆడియెన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే బిగ్‌బాస్ హౌజ్‌లో సోమవారం నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి.
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్ ఏడో సీజన్ ఏడో వారంలోకి ప్రవేశించింది. అయితే ఆరో వారం ఎలిమినేషన్ మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పాపం సోషల్ మీడియా సెన్సేషన్ నయని పావని కేవలం ఒక్క వారానికే హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో మళ్లీ బిగ్ బాస్ ఓటింగ్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. బిగ్‌బాస్‌లో అంతా అగ్రిమెంట్ ప్రకారమే నడుస్తుందని ఆడియెన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే బిగ్‌బాస్ హౌజ్‌లో సోమవారం నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. కాగా ఇప్పటివరకు పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా, కొత్తగా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా విభజించిన బిగ్‌బాస్ ఇవాళ అంటే అక్టోబర్ 16న ఆ తారతమ్యాలు చెరిపేశాడు. ఇక హౌజ్‌లో అందరూ సమానమేనన్నాడు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా.. కంటెస్టెంట్ల ఎదుట ఉన్న కుండను పగలగొట్టి నామినేషన్ చేయాలని తెలిపాడు. కాగా సీజన్ ప్రారంభంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌పై మూకుమ్మడిగా దాడి చేసి నామినేట్ చేసిన కంటెస్టెంట్స్.. ఈ వారం డప్పు బిడ్డ భోలేషావళి పై పడ్డారు. ఈ వారం హౌజ్‌లో మెజారిటీ కంటెస్టెంట్స్ భోలేని నామినేట్ చేయడం గమనార్హం. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టి, అర్జున్, ప్రియాంక, పూజా, భోలేని నామినేట్ చేస్తూ.. గొడవకు దిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముంబై రోడ్డులో నాగుపాము !! ఆటోఎక్కి ?? షాకింగ్ వీడియో
తనను ఆదరించిన వ్యక్తి చనిపోవడంతో ఆ కోతి ఏం చేసిందో చూడండి
నవదుర్గా ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం