Veena Srivani: డార్లింగ్ ప్రభా.. ఇది మీకు మాత్రమే.! స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.!
ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ నిత్యం ట్రెండింగ్‌లో ఉంటారాయన. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలోనూ బాగా ఫేమస్ అయిపోయారు వేణు స్వామి. రీల్స్, షార్ట్స్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే పనిలో ఉన్నారు. జ్యోతిష్కుడిగా వేణు స్వామి ఎంత పాపులరో ఆయన సతీమణి వీణా శ్రీవాణి కూడా వీణ వాయించడంలో బాగా ఫేమస్.
ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ నిత్యం ట్రెండింగ్‌లో ఉంటారాయన. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలోనూ బాగా ఫేమస్ అయిపోయారు వేణు స్వామి. రీల్స్, షార్ట్స్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే పనిలో ఉన్నారు. జ్యోతిష్కుడిగా వేణు స్వామి ఎంత పాపులరో ఆయన సతీమణి వీణా శ్రీవాణి కూడా వీణ వాయించడంలో బాగా ఫేమస్. ఎప్పుడూ చేతిలో వీణతో కనిపించే ఆమె తెలుగు, హిందీ సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణపై పలికిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు బాగా ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కోసం ఒక స్వీట్ గిఫ్ట్ ను పంపారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇందులో వారు పండించిన సీతా ఫలాలను చూపిస్తూ.. అవన్నీ మన డార్లింగ్ ప్రభాస్ కు పంపుతున్నట్లు చెప్పుకొచ్చారు. “మేం పండించే సీతాఫలాలు ఏటా కోంతమందికి పంపుతాం. ఇలా ఓ స్పెషల్ వ్యక్తికి ఆ ఫలాలను పంపిస్తే ఆయన దగ్గరి నుంచి ప్రభాస్ వద్దకు చేరాయి. నేను పంపిన సీతా ఫలాలు ప్రభాస్ కు బాగా నచ్చాయి. ఇంకొన్ని కావాలని అడిగారు. మరి పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ అడిగితే పంపించకుండా ఉండగలరా? చెప్పండి. అందుకే ఈ బాస్కెట్ లో ఉన్న సీతా ఫలాలన్నీ ప్రభాస్ కోసం పంపిస్తున్నాను. వీటితో పాటు నా గుర్తుగా హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా పంపుతున్నాను. ఈ ఏడాదికి ఇదే ఆఖరి పంట. మళ్లీ వచ్చే సీజన్ లో ప్రభాస్ కోసం మరోసారి సీతాఫలాలు పంపుతాను” అని చెప్పుకొచ్చారు వీణా శ్రీవాణి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!