Jayam Ravi: కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్

Edited By:

Updated on: May 18, 2026 | 7:21 PM

భార్య ఆర్తితో విడిపోయిన తర్వాత సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో రిలేషన్‌లో ఉన్న జయం రవి జీవితంలో మరో బ్రేకప్ వార్త చర్చనీయాంశమైంది. “అతన్ని పూర్తిగా వదిలేస్తున్నాను” అంటూ కెనీషా చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై వదిలి వెళ్లిపోతున్నానని, తన కెరీర్‌ను కూడా వదులుకుంటున్నానని ఆమె పేర్కొనడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

కొందరు నటులు సినిమాల కంటే ఎక్కువగా తమ పర్సనల్ లైఫ్‌తోనే ఫేమస్ అవుతూ ఉంటారు. జయం రవి కూడా అంతే. తమిళంలో ఎంత పెద్ద నటుడైనా.. తెలుగులో మాత్రం విడాకులతోనే ఫేమస్ అయ్యారు. తాజాగా ఈ హీరో లైఫ్‌లో మరో బ్రేకప్ వచ్చినట్లే కనిపిస్తుంది. రవి జీవితంలో ఈ కొత్త ట్విస్ట్ ఏంటి..? త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారనుకున్న జంట మధ్య ఏం జరిగింది.. భార్య ఆర్తితో విడిపోయి సింగర్ కెనీషాతో సహజీవనం చేస్తున్న హీరో జయం రవి తాజాగా మరో బ్రేకప్ వైపు అడుగులేస్తున్నారు. అతన్ని పూర్తిగా వదిలేస్తున్నట్లు కెనీషా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రెండేళ్లుగా ఈ హీరో పర్సనల్ లైఫ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి భార్య ఆర్తితో విడిపోయిన తర్వాత సింగర్ కెనీషాతో డేటింగ్ చేస్తున్న ఈయన.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అంతా సవ్యంగా సాగుతుందుకుంటున్న సమయంలో.. ఊహించని విధంగా కెనీషా ఫ్రాన్సిస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ షాక్‌కు గురిచేస్తోందిప్పుడు. రవి మోహన్‌ను తాను పూర్తిగా వదిలేస్తున్నానని, అతన్ని అభిమానించే లేదంటే ద్వేషించే అందరికీ ఇకపై అతడు పూర్తిగా మీ సొంతం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. జయం రవి పేరు పెట్టకుండా.. ఆయనకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు ఇక తనకు లేవని, చెన్నై కూడా వదిలేసి వెళ్లిపోతున్నానని కెనీషా ఆ పోస్ట్‌లో తీవ్ర భావోద్వేగానికి గురైంది. దేవుడు కలిపిన బంధాన్ని మనుషులు విడదీశారు అంటూ తన మ్యూజిక్, థెరపీ కెరీర్‌ను కూడా వదులుకుంటున్నట్లు ఆమె ప్రకటించి షాక్ ఇచ్చారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలకు దూరమైన రవి మోహన్.. ఇప్పుడు కెనీషాతో కూడా బ్రేకప్ చేసుకోవడం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఎందుకొచ్చాయి.. ఈ ఊహించని బ్రేకప్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై జయం రవి స్పందిస్తారా లేదా అనేది చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్

Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??

కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

Follow Us