అత్తామామలతో కలిసి.. CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్

Updated on: Oct 18, 2026 | 3:11 PM

సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, కావ్య మారన్‌ వివాహంపై మరోసారి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం విజయ్‌, గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌లను వివాహానికి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కళానిధి మారన్‌, కావేరి మారన్‌తో పాటు అనిరుధ్‌ కూడా పాల్గొన్నట్లు ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులను స్వయంగా కలిసి వివాహానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం విజయ్‌, ఆ రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌లను కలిసి పెళ్లికి ఆహ్వానించారు.ఈమేరకు దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కళానిధి మారన్‌, కావేరి మారన్‌తో పాటు అనిరుధ్‌ కూడా పాల్గొన్నాడు. అనిరుధ్‌, కావ్య మారన్‌ల వివాహం గ్రీస్‌లో జరగనుందని, నవంబర్‌ 11న పెళ్లి ముహూర్తం ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. వివాహ తేదీ, వేదిక వివరాలు కూడా ఇంకా ఖరారైనట్లు అధికారికంగా వెల్లడించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

5నిమిషాలు కనిపించినందుకే.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!

Ranabaali: ‘రణబాలి’కి ఫస్ట్‌డే.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌

తన బిడ్డ పెళ్లికి రావాలంటూ.. సీఎం రేవంత్‌కు మారన్ ఆహ్వానం

పెళ్లికి వేలైంది.. ఇన్విటేషన్స్ పంచుతున్న మారన్

Sudigali Sudheer: నిశ్చితార్థం జరిగాక.. సుధీర్ పెళ్లి ఆగిపోయిందా..!

Loading...
Unable to load recommendations.
Follow Us