ఆంధ్రాకింగ్‌ రామ్‌కి సక్సెస్‌ తెచ్చిపెడుతుందా ??

Edited By:

Updated on: Nov 22, 2025 | 1:38 PM

ఆంధ్రా కింగ్ తాలూక చిత్రం రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, దర్శకుడు మహేష్, మైత్రి మూవీ మేకర్స్‌కి ఎంతో కీలకం. రామ్ ఈ సినిమాతో భావోద్వేగంగా అనుబంధం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. కింగ్డమ్ తర్వాత భాగ్యశ్రీ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉపేంద్ర, దర్శకుడు మహేష్‌లకు కూడా విజయం అవసరం. ఈ చిత్ర విజయం అందరికీ చాలా ముఖ్యమైనది.

సినిమాకి పనిచేసిన వారిలో ఒకరిద్దరికి హిట్‌ కావాలంటే అది వేరు. కానీ సినిమాకు పని చేసిన మెయిన్‌ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికీ హిట్‌ కావాలంటే… అందరూ విజయం కోసం ఎదురుచూస్తుంటే… ఆంధ్రా కింగ్‌ తాలూక తరహా సినిమా అవుతుంది. హీరో, హీరోయిన్‌, డైరక్టర్‌, ప్రొడక్షన్‌ హౌస్‌… ప్రతి ఒక్కరికీ హిట్‌ కావాలక్కడ. నేను చాలా సినిమాలు చేశాను. ఎమోషనల్‌గా కనెక్ట్ అయి చేసిన సినిమా ఆంధ్రా కింగ్‌ తాలూకా అని అన్నారు రామ్‌ పోతినేని. పర్సనల్‌గా తనకున్న చాలా ఆలోచనలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. ఆంధ్రా కింగ్‌ తాలూకలో ఫ్యాన్‌ బోయ్‌గా కనిపిస్తారు ఎనర్జిటిక్‌ స్టార్‌. రామ్‌కే కాదు, భాగ్యశ్రీ బోర్సేకి కూడా బంపర్‌ హిట్‌ కావాలి. కింగ్‌డమ్‌తో పేరు తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా బ్లాక్‌ బస్టర్‌ విజయం కోసం వెయిట్‌ చేస్తున్నారు భాగ్యశ్రీ. ఆంధ్రా కింగ్‌ తాలూకా తన కమర్షియల్‌ మార్క్ ని అప్‌గ్రేడ్‌ చేస్తుందన్నది భాగ్యశ్రీ హోప్‌. ఈ మూవీలో సూపర్‌స్టార్‌గా కనిపిస్తారు ఉపేంద్ర. ఆయన కూడా తెలుగులో పర్ఫెక్ట్ సక్సెస్‌ చూసి చాన్నాళ్లయింది. ఇటు డైరక్టర్‌ మహేష్‌ లాస్ట్ మూవీ సక్సెస్‌ అనుష్క ఖాతాలో పడింది. రామ్‌లాంటి ఎనర్జిటిక్‌ స్టార్‌ని ఆయన హ్యాండిల్‌ చేయడం ఇదే ఫస్ట్ టైమ్‌. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ కి కూడా ఆంధ్రా కింగ్‌ తాలూక సక్సెస్‌ చాలా కీలకంగా మారింది. ఈ ఇయర్‌ మైత్రీ మూవీస్‌ రిలీజ్‌ చేసిన మూవీస్‌కి మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. రాబిన్‌హుడ్‌లాంటి ఫ్లాప్‌లున్నాయి. డ్యూడ్‌లాంటి సక్సెస్‌లున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రా కింగ్‌ తాలూక సక్సెస్‌ కూడా ప్రొడక్షన్‌ హౌస్‌ కూడా వెయిటింగ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రఫ్ఫాడిస్తున్న హీరోయిన్స్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదంటున్న ముద్దుగుమ్మలు

ట్రెండ్‌ అవుతున్న ఆలియా.. ఆమె వెంటనే సంయుక్త జాజికాయ

కాంట్రవర్సీలను జక్కన్న కావాలనే క్రియేట్‌ చేస్తారా ??

కాలువలో దిగి.. ఎక్కలేకపోయిన ఏనుగు.. ఆ తర్వాత

బిగ్ బాస్‌ హౌస్‌లో వేధింపులు.. మహిళా కమిషన్‌ సీరియస్‌