Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??

Updated on: Mar 13, 2026 | 8:19 PM

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, AMB సినిమాస్‌తో మల్టీప్లెక్స్ రంగంలో దూసుకుపోతున్నారు. హైదరాబాద్‌లో విజయవంతమైన AMB బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఇటీవల బెంగళూరులో అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. త్వరలో విశాఖపట్నం, గోవా, కేరళ, తమిళనాడులో AMB సినిమాస్ ప్రాజెక్టులు రానున్నాయి. ఈ వ్యాపార విస్తరణతో మహేష్ బాబు దేశవ్యాప్తంగా తన ముద్ర వేయనున్నారు.

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్ బాబు భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తూనే మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏషియన్ సినిమాస్‌తో సంయుక్తంగా ఏఎంబీ సినిమాస్‌ను నిర్మించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ను విస్తరింపచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈక్రమంలోనే రీసెంట్‌గా బెంగళూరులో తొమ్మిది స్క్రీన్లతో అత్యాధునిక సదుపాయాలతో మల్టీఫ్లెక్స్‌ ప్రారంభించారు. అయితే, ఇప్పుడు విశాఖలో కూడా తన వ్యాపారాన్ని విస్తరింపచేయాలని మహేష్‌ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. నెక్ట్స్‌ విశాఖ మాత్రమే కాదు.. గోవా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఏఎంబీ మల్టీఫ్లెక్స్‌ను ప్రారంభించాలని మహేష్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అతిపెద్ద షాపింగ్‌మాల్‌తో పాటు మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్‌

Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా

విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు

చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి

ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ

Follow Us