Amardeep – Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై చివరికి నోరు విప్పిన అమర్.. వీడియో.
బిగ్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి.. నిన్నమొన్నటి వరకు పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్ దీప్ అన్నట్టుగానే సాగింది. ఇద్దరూ కొట్టుకోవడం.. అన్నా.. అన్నా అని పిలుచుకోవడం.. మళ్లీ ఎడ మొహం పెడ మొహంగా ఉండడం.. కామన్ అయిపోయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం దీన్నంతా సీరియస్‌గా తీసుకుని.. గ్రాండ్ ఫినాలే ముగియగానే కొట్టుకున్నారు. అందులో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే మరీ రెచ్చిపోయారు. అమర్ కార్‌తో పాటు.. ఇతర కంటెస్టెంట్ల కార్లను.. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు.
బిగ్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి.. నిన్నమొన్నటి వరకు పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్ దీప్ అన్నట్టుగానే సాగింది. ఇద్దరూ కొట్టుకోవడం.. అన్నా.. అన్నా అని పిలుచుకోవడం.. మళ్లీ ఎడ మొహం పెడ మొహంగా ఉండడం.. కామన్ అయిపోయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం దీన్నంతా సీరియస్‌గా తీసుకుని.. గ్రాండ్ ఫినాలే ముగియగానే కొట్టుకున్నారు. అందులో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే మరీ రెచ్చిపోయారు. అమర్ కార్‌తో పాటు.. ఇతర కంటెస్టెంట్ల కార్లను.. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ కూడా.. పోలీసులు చెప్పిన మాట వినక.. చిక్కుల్లో ఇరుకున్నారు. చివరికి జైలు పాలై.. బెయిల్ మీద బయటికి వచ్చాడు. అయితే ఇదంతా జరిగిన ఇన్ని రోజులకు తాజాగా.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై నోరు విప్పాడు అమర్ దీప్. “ప్రశాంత్ అరెస్ట్ అయ్యడంటే.. కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల అలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడన్నా క్లియర్ అయిపోయాయి. అంతా కూల్. బయట ఫ్యాన్స్ గొడవలు సహజం. మేం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు కూడా మా హీరో అంటే హీరో అని కొట్టుకునేవాళ్లం. ఫ్యాన్స్ గొడవపడుతుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే.. మేం బాగానే ఉన్నాం. గొడవలు పెట్టుకోవద్దు. మీరు బాగా ఉండండి. మేం బాగా ఉంటాం. త్వరలో రవితేజ సినిమా అప్డేట్ తో మీ ముందు ఉంటాను. బిగ్బాస్ తో నా లైఫ్ చాలా మారిపోయింది అనుకోను. కానీ మైండ్ మెచ్యురిటీ వచ్చింది. హౌస్ లో నేను వీక్ అన్నారు. కానీ నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.