Raaka: రాకా అప్‌డేట్.. సస్పెన్స్‌లో పెట్టిన మేకర్స్..!

Edited By:

Updated on: Sep 19, 2026 | 6:32 PM

అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరుగుతోంది. తాజాగా సన్‌ పిక్చర్స్‌ ‘3/7’ అంటూ ‘సమ్‌థింగ్‌ బిగ్‌ లోడింగ్‌’ అనే పజిల్‌ పోస్ట్‌ చేసింది. ఇది 2027 జూలై రిలీజ్‌ డేట్‌కు హింటా, లేక సెప్టెంబర్‌ 21న అట్లీ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ అప్‌డేట్‌కు సంకేతమా అనే చర్చ జరుగుతోంది. ఈ పజిల్‌ వెనక అసలు లాజిక్‌పై క్యూరియాసిటీ నెలకొంది.

రాకా టీం పోస్ట్ చేసిన 3/7 అంటే ఏంటి..? వాళ్లిచ్చిన పజిల్‌ వెనక లాజిక్ ఏంటి..? 3/7 అంటే 2027 జూలైలో సినిమా విడుదల కానుందా లేదంటే దాని వెనక ఇంకేదైనా స్టోరీ ఉందా..? అసలు ఏ అప్‌డేట్ ఇవ్వకుండా కేవలం ఆ రెండు అంకెలతోనే రాకా టీం ఏం చెప్పాలనుకుంటున్నారు..? ఆ పజిల్ వెనకున్న ఆన్సర్ ఏంటో చూసేద్దామా..? అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న రాకా సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కానీ అప్పుడెప్పుడో ఓపెనింగ్ టైమ్‌లో వచ్చిన రెండు వీడియోలు మినహాయిస్తే.. మళ్లీ ఇప్పటి వరకు అట్లీ అండ్ టీం నుంచి ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు. అల్లు అర్జున్ బర్త్ డేను కూడా జస్ట్ ఒక్క పోస్టర్‌తోనే సరిపెట్టేసారు. కొన్ని నెలలుగా ముంబైలోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ రాకాతో ప్లాన్ చేస్తున్నారు అట్లీ. దీనికోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. దీపిక పదుకొనేతో పాటు మరో మగ్గురు స్టార్ హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. బన్నీ కూడా మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నారని తెలుస్తుంది. తాజాగా సన్ పిక్చర్స్ 3/7 అంటూ రాసి సమ్‌థింగ్ బిగ్ లోడింగ్ అంటూ పోస్ట్ చేసారు. సెప్టెంబర్ 21న అట్లీ బర్త్ డే.. ఆరోజు టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే లెక్కలతో హింటిచ్చారు.. సైన్స్ ఫిక్షన్‌తో కూడిన లార్జర్ దెన్ లైఫ్ సినిమా ఇది. పుష్ప తర్వాత బన్నీ చేస్తున్న సినిమా ఇది. అందుకు అంచనాలు ఊహకందని విధంగా ఉన్నాయి. మొత్తానికి చూడాలిక.. రాకా టీం ఇవ్వబోయే ఆ అప్‌డేట్ ఏంటో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ …అభిషేక్‌ శర్మ వరల్డ్‌ రికార్డ్‌

ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!

దేశవ్యాప్తంగా పనీర్‌ బ్యాన్‌! 5 వేల లైసెన్సులు రద్దు!

UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?

Nirmala Seetharaman: ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్‌

Loading...
Unable to load recommendations.
Follow Us