అల్లు అర్జున్‌కి దాదాసాహెబ్ ఫాల్కే.. బన్నీ రియాక్షన్‌ ఇదే వీడియో

Updated on: Nov 03, 2025 | 11:31 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ‘మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అవార్డును అభిమానులకు అంకితం చేస్తూ, కృతజ్ఞతలు తెలిపారు. అట్లీ కుమార్‌తో ఆయన రాబోయే పాన్-వరల్డ్ సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ఆయన మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. “ఇంతటి అద్భుతమైన గౌరవం ఇచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీకి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇతర విభాగాల విజేతలకు నా హృదయపూర్వక అభినందనలు. నిరంతరం నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డును నా అభిమానులకు సవినయంగా అంకితం చేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.