Naga Chaitanya-Samantha: సామ్‌తో చివరి జ్ఞాపకాన్ని కూడా చెరిపేసిన చైతూ.! వీడియో..

|

Oct 29, 2024 | 11:07 AM

సామ్ తో విడాకుల అనంతరం ఆమెతో ఉన్న జ్ఞాపకాలను చెరిపేస్తున్న నాగ చైతన్య... మరోసారి అదే పని చేశాడు. తన సోషల్ మీడియా ఖాతాల్లో సామ్ తో కలిసున్న ఫొటోలన్నింటినీ ఇప్పటికే డిలీట్ చేసిన చై.. ఇప్పటి వరకు ఒక్క ఫొటో మాత్రం డిలీట్ చేయకుండా అలాగే వదిలేశాడు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్ తో పాటు 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా ఉన్నాయి.

అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టునున్నాడు. పెళ్లి పనులు కూడా మొదలెట్టేశాడు. ఇక ఈ క్రమంలోనే.. తన దగ్గర ఉన్నసామ్‌ చివరి జ్ఙాపకాన్ని కూడా చెరిపేశాడు నాగ చైతన్య.

సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన ఫొటో కూడా ఉంది. దీనికి ‘బ్యాక్ త్రో..  మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్’ అని క్యాప్షన్‌ ఉంది. అయితే తాజాగా ఆ ఫోటోను కూడా నాగ చైతన్య తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ నుంచి తీసేశాడు. శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా ఈ ఫొటోను అలాగే ఉంచడంతో సమంత అభిమానులు ఫీలయ్యారు. వెంటనే ఈ ఫొటోను కూడా డిలీట్ చేయాలంటూ చైతన్యను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగ చైతన్య.. సమంత ఫొటోను, ఆ పోస్ట్ ను తొలగించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 29, 2024 11:05 AM