180 కోట్ల బడ్జెట్‌లో అప్పుడే 80 కోట్ల వసూళు.. దటీజ్ బాలయ్య క్రేజ్!
బాలయ్య - బోయపాటి కాంబోకు డెడ్లీ కాంబో అనే నేమ్ ఉంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర విస్పోటనమే అనే కామెంటూ ఉంది. వీళ్ల రికార్డులు వీళ్లే తిరగరాసుకునే చరిత్ర ఉంది. అలాంటి వీరిద్దరూ కలిసి.. అఖండ2 మొదలెడుతురని తెలిసింది మొదలు.. ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఓటీటీ సంస్థల నుంచి కూడా ఈ మూవీ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది.
ఇప్పుడు ఆ పోటీనే.. … అఖండ2 సినిమా రిలీజ్ కు ముందే బడ్జెట్‌లో దాదాపు దాదాపు 47శాతం వెనక్కి వచ్చేలా చేసుకుందని ఫిల్మ్ నగర్ న్యూస్. బాలయ్య – బోయపాటిది సక్సెస్ ఫుల్.. అందులోనూ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ అఖండ సినిమాకు సీక్వెల్… కావడంతో.. అఖండ2 పై విపరీతమైన క్రేజ్ ఉంది. డివోషనల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో… ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో టాప్ ఓటీటీ సంస్థలన్నీ ఈ మూవీ రైట్స్ కోసం చాలా పోటీ పడ్డాయట. అయితే అందులో నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్‌ను దాదాపు 80 కోట్లకు దక్కించుకుందని న్యూస్. ఈ సినిమా కోసం మేకర్స్ 180 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఓటీటీ డీల్‌తోనే 80 కోట్లు వెనక్కి రావడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య క్రేజ్‌కు ఇదో క్రేజీ ఎగ్జాంపుల్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ మధ్య పెట్టి వెళ్లాడు.. ఏం జరిగిందంటే
జాక్ పాట్ కొట్టిన ఇమ్మాన్యుయేల్! బిగ్ బాస్ నుంచి మనోడికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్
