ఏటా శివ మాల వేసుకుంటా.. పీరియడ్స్ రాకుండా ఆ పని చేస్తా…

Updated on: Sep 20, 2025 | 12:33 PM

నాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నటి స్నిగ్ద నయని. మొదట సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా స్థిర పడిపోయింది. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ.. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. చూడ్డానికి మగరాయుడిలా కనిపించే స్నిగ్ద చాలా డేరింగ్. ఏ విషయమైనా మొహమాటం లేకుండా మాట్లాడుతుంది.

అలా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్నిగ్ద తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమాల్లో బిజీగా ఉండే స్నిగ్ద ఇటీవల శివమాలలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విషయంపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘నేను శివుడిని బాగా ఆరాధిస్తాను. ప్రతీ సంవత్సరం శివమాల కూడా ధరిస్తాను. మాల వేసుకున్నప్పుడు ఎంతో నిష్టగా ఉంటాను. అలాగే కొన్ని మందులు వాడి పీరియడ్స్ ని ఆపుకొంటాను. నిజం చెప్పాలంటే నాకు థైరాయిడ్ సమస్య ఉంది. అలాగే PCOD కూడా ఉంది. అందుకే నాకు ప్రతి మూడు నెలలకు లేదా నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే పిరియడ్ వస్తుంది’ అంటూ ధైర్యంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నిగ్ద కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ప్రస్తుతం స్నిగ్ధ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.. కానీ సింగర్‌గా పలు షోలు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలతో పాటు తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేసుకుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Little Hearts: లిటిల్ హార్ట్స్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో..

థార్‌ కారులో ఫుడ్‌ డెలివరీ.. షాకైన కస్టమర్‌

వీధి కుక్కలపై వింత నిర్ణయం రెండు సార్లు కరిస్తే.. జీవిత ఖైదే