Suriya: మనోడి లుక్స్‌ చాలు.. పిచ్చెక్కిపోడానికి.. వైరల్ అవుతున్న సూర్య స్టైలిష్ లుక్

|

Feb 03, 2024 | 9:19 AM

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో సూర్య ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే ఉన్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సూర్య. ప్రస్తుతం అతను శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయికగా నటిస్తుంది.

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో సూర్య ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే ఉన్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సూర్య. ప్రస్తుతం అతను శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయికగా నటిస్తుంది. చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది జూన్ 16న ఈ చిత్రాల్లో పలు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా సూర్య అభిమానులు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇన్నాళ్లు కంగువ సినిమా కోసం మాస్ అవతారంలో కనిపించిన సూర్య.. ఇప్పుడు ట్రెండీ అండ్ స్టైలీష్ లుక్‏లో కనిపించాడు. సూర్య ఫోటోను అవినాష్ గోవారికర్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ… “కంగువ సినిమా కోసం చాలా కాలం తర్వాత సూర్య… స్టైలీష్ లుక్, ఫోజు నమ్మశక్యంగా లేదు ” అంటూ రాసుకొచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: తగ్గుదే లే !! కండలు పెంచే పనిలో మెగాస్టార్

Mrunal Thakur: మరీ దారుణం ఈ హీరోయిన్‌ ఇలాంటి క్యారెక్టర్లోనా ??

Jr.NTR: భావోద్వేగాల మిళితం.. కదిలిపోయిన జూనియర్ ఎన్టీఆర్

Tripti Dimri: అలాంటి వ్యక్తి అయితే పెళ్లికి ఓకే షాకిచ్చిన హీరోయిన్

4 రోజులు ఉద్యోగం.. 3 రోజులు సెలవులు.. ఎక్కడో తెలుసా ??

Follow us on