Suriya: ఇటు చరణ్.. అటు సూర్య.. రసవత్తరంగా గేమ్

|

Dec 29, 2023 | 1:37 PM

కోలీవుడ్ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. ప్రజాసేవ, క్రీడాంశాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూర్య లీగ్ క్రికెట్‏లోకి అడుగుపెట్టారు. స్ట్రీట్ క్రికెట్ లీగ్‏లో చెన్నై జట్టును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సూర్య స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇక ఇటీవల ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కోలీవుడ్ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. ప్రజాసేవ, క్రీడాంశాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూర్య లీగ్ క్రికెట్‏లోకి అడుగుపెట్టారు. స్ట్రీట్ క్రికెట్ లీగ్‏లో చెన్నై జట్టును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సూర్య స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇక ఇటీవల ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతి రాష్ట్రంలోని ప్రజలు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, శ్రీనగర్ సహా టీమ్‌లను కొనుగోలు చేసిన నటీనటుల గురించి గతంలో ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు చెన్నై టీమ్‌ని కొనుగోలు చేశారు సూర్య. ఇప్పటివరకు స్టేడియంలో ఆడే అవకాశం రాని క్రికెటర్లకు స్ట్రీట్ క్రికెట్ లీగ్ మంచి వేదిక కానుందని అంటున్నారు. స్ట్రీట్ క్రికెట్ ఆడే అద్భుతమైన పోటీదారుడు అయితే వెంటనే ISPLలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో హైదరాబాద్ టీంను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేశాడు. అలాగే శ్రీనగర్ టీంను అక్షయ్ కుమార్ కొనుగోలు చేశారు. బెంగళూరు జట్టును హృతిక్ రోషన్ కొనుగోలు చేశారు. ముంబై జట్టును నటుడు అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారు. ఇప్పుడు సూర్య చెన్నై టీంను కొనుగోలు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ హీరోతో ఎఫైర్.. రెండో పెళ్లి !! క్లారిటీ ఇచ్చిన మీనా..

Follow us on