Unstoppable 4: అన్‌స్టాపబుల్ షో లో సింహా Vs సింగం.! సూర్యతో పాటు ఆయన కూడా..
సినిమాల్లోనే కాదు.. ఓటీటీ ఎంట్రీతో కూడా తన మార్క్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన స్టార్ నందమూరి బాలయ్య. ఓ పక్క తన సినిమాలతో కలెక్షన్లు కుమ్మేస్తున్న బాలయ్య.. ఇంకో పక్క అన్‌స్టాపబుల్ షో.. చేస్తూ.. స్ట్రీమింగ్ మినెట్స్‌లో సెన్సేషనల్ అయ్యారు. ఓటీటీ ఫీల్డ్ లోనే.. ఆహా అనేంత క్రేజ్ సంపాదించుకున్నారు. తన హోస్టింగ్ స్టైల్‌తో.. అన్ స్టాపబుల్ షోతో.. అన్ స్టాపబుల్ రికార్డులు క్రియేట్ చేస్తూనే వెళుతున్నారు.
సిల్వర్ స్క్రీన్ పై డైలాగులతో దుమ్ముదులపడం.. థియేటర్‌ను షేక్ చేయడం.. తన పేరునే అందరూ జపించేలా చేయడం.. బాలయ్య సొంతం. ఇక ఓ రాష్ట్రాన్ని ముందుకు నడపడం.. అధునాతన టెక్నాలిజీని అడాప్ట్ చేసుకుకుని పరిపాలన సాగించడం.. నారా చంద్ర బాబు నాయుడి సొంతం. ఎట్ ప్రజెంట్ ఏపీ సీఎంగా తన మార్క్ పాలన సాగిస్తున్న ఆయనే.. అన్‌స్టాపబుల్ సీజన్ 4కు వస్తున్నారు. బాలయ్యకు మరోసారి సరదా కబుర్లు చెప్పబోతున్నారు. ఫన్నీ టాస్క్‌లు ఆడి కాసేపు తనలోని మరో కోణాన్ని మనకు చూపించబోతున్నారు. ఇక సీజన్ 4కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ టాక్ షోకు స్టార్ హీరో సూర్య కూడా హాజరయ్యాడు. సూర్య నటిస్తున్న కంగువ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య అన్ స్టాపబుల్ షోకు హాజరయ్యాడు. సూర్యతో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా బాలయ్య షోకు హాజరయ్యారు. ఇప్పటికే కంగువ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బాలయ్య షోలో సూర్య, బాబీ డియోల్ లు ఎలా సందడి చేస్తారో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.