తిండి నిద్ర మానేసి.. టెన్షన్‌తో చిక్కిపోయి.. జైల్లో స్టార్ హీరోకు దారుణ పరిస్థితి

|

Jun 25, 2024 | 6:21 PM

రేణుకా స్వామి హత్య కేసుతో సంచలనంగా మారాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. తన లవర్‌ను వేధించాడనే కోపంతో.. రేణుకా స్వామిని హత్య చేయించాడు. ఇప్పుడు స్టార్ గా కాకుండా ఖైదీలా మారి జైలులో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. టెన్షన్‌తో చిక్కిపోయాడు. బెంగళూరు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్‌కు పరప్పన అగ్రహార జైలులో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. దర్శన్‌తో పాటు మరో నటుడు ప్రదోశ్‌కు అటాచ్డ్ బాత్‌ రూమ్‌తో కూడిన ప్రత్యేక బ్యారక్‌ ఇచ్చారు.

రేణుకా స్వామి హత్య కేసుతో సంచలనంగా మారాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. తన లవర్‌ను వేధించాడనే కోపంతో.. రేణుకా స్వామిని హత్య చేయించాడు. ఇప్పుడు స్టార్ గా కాకుండా ఖైదీలా మారి జైలులో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. టెన్షన్‌తో చిక్కిపోయాడు. బెంగళూరు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్‌కు పరప్పన అగ్రహార జైలులో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. దర్శన్‌తో పాటు మరో నటుడు ప్రదోశ్‌కు అటాచ్డ్ బాత్‌ రూమ్‌తో కూడిన ప్రత్యేక బ్యారక్‌ ఇచ్చారు. రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్‌కు 6106 నెంబరును కేటాయించారు జైలు అధికారులు. ఇక జైలులో దర్శన్‌ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దర్శన్ అరకొరగా భోజనం చేస్తున్నట్లు.. రాత్రి ఆలస్యంగా నిద్రపోయినట్లు జైలు సిబ్బంది గుర్తించారు. హత్య కేసులో దర్శన్‌ అరెస్టయి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ఆయన బరువు కొంత తగ్గగా, బీపీ కూడా నియంత్రణలో లేదని జైలు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న పవిత్ర.. హత్యకు ముందు తెలియదా మరి ??

Nagarjuna: అభిమానికి క్షమాపణ చెప్పిన కింగ్ నాగ్

TOP 9 ET News: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన అల్లు అరవింద్